Dr Ambedkar : డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి.. ఒక గొప్ప అర్థ శాస్త్ర నిపుణుడు..!
ప్రధానాంశాలు:
డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి.. ఒక గొప్ప అర్థ శాస్త్ర నిపుణుడు..!
ఏప్రిల్ 14 మాత్రమే అంబేద్కర్ స్మరణ కాదు,భారతదేశం 365 రోజులు స్మరించాల్సిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు – బిజెపి మేడ్చల్ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర, ఎదులాబాధ్ ఘట్కేసర్,కాచవాని సింగారం,అవుశాపూర్,మరిపల్లిగూడ మరియు అంకుశాపూర్ లలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – స్వాతంత్ర్యానికి పూర్వం దేశ ప్రజలు వివిధ విదేశీ పాలకుల చేతిలో తమ హక్కులను కోల్పోయిన దుర్భర పరిస్థితులకు రాజ్యాంగ రచనలో తగదైన శైలిలో పరిష్కారం చూపిన వేగు చుక్క అంబేద్కర్ గారు.

Dr Ambedkar : డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి.. ఒక గొప్ప అర్థ శాస్త్ర నిపుణుడు..!
Dr Ambedkar సమాజంలోని వర్గాలు అంబేద్కర్ ను చూడాల్సిన దృష్టి కోణం మారాలి..
– ఆయన భారత రాజ్యాంగ రూప శిల్పి మాత్రమే కాదు ఒక గొప్ప అర్థ శాస్త్ర నిపుణుడు..
– ఆయన అర్ధ శాస్త్రంలో పిహెచ్డి సాధించిన మొట్ట మొదటి భారతీయుడు..
– సమాజంలో అనేక శాస్త్రాలను అవపోషణ పట్టి వాటి ద్వారా సమాజంలోని అనేక మార్పులకు నాంది పలికిన మహనీయుడు..
– ఎకనామిక్స్ లో 29 కోర్సులు,హిస్టరీ లో 11,సోషియాలజీలో 6 ఫిలాసఫీలో 5,ఆంథ్రోపాలజీలో 4,పొలిటికల్ సైన్స్ లో 3 కోర్సులు పూర్తి చేయడం జరిగింది..
– ఎకనామిక్స్ లో 3 పుస్తకాలను రచించారు..
– భవిష్యత్ భారత అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే గొప్ప అవకాశాన్ని ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది..
– ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలలో ఉన్న గొప్ప ప్రాక్టీసెస్ ను ఆయన మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది..
– అంబేద్కర్ స్పూర్తితో ప్రజలు ప్రశ్నించడం,తర్కించడం,వాదించడం,విభేదించడం నేర్చుకోవాలి..