Elections : నా భర్తపై ఇండిపెండెట్‌గా పోటీ చేస్తా.. తప్పక ఓడిస్తానంటూ భార్య కామెంట్..!
ప్రధానాంశాలు:
Elections : నా భర్తపై ఇండిపెండెట్‌గా పోటీ చేస్తా.. తప్పక ఓడిస్తానంటూ భార్య కామెంట్..!
Elections : ఏపీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారంలో వేడెక్కుతుంది. ఇటు అధినేతల ప్రచార హోరు కొనసాగుతుండగా, సీట్లు ఆశించి భంగ పడిన వారు రెబల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ నుంచి అక్కడ దువ్వాడ శ్రీను అభ్యర్దిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు పోటీగా శ్రీను సతీమణి వాణి రెబల్ గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య అయి వాణి తాను టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు.
Elections : భర్తపై పోటి..
గురువారం జడ్పీటీసీ సభ్యురాలైన వాణి జన్మదినం కావడంతో కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నట్టు వారితో చెప్పారు. మరోవైపు, దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్టు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే వాణిని టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైసీపీ నియమించడం జరిగింది.
మరోవైపు శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచీ ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ముఖ్యనాయకులు ఆమెను నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగినట్టు తెలుస్తుంది. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నేతలు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు ఆమె స్పష్టం చేయటంతో రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు, ఇద్దరి మధ్య ఎలాంటి ఫైట్ నెలకొని ఉంటుందనే దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. చూస్తుంటే ఈ సారి ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారడమే కాక ప్రతి ఒక్కరిలో అటెన్షన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.