Rajya Sabha : రాజ్య‌స‌భ సీట్ల భ‌ర్తీలో కూట‌మి ప్ర‌భుత్వానికి స‌మ ప్రాధాన్యం.. లైన్‌లో మెగా, నంద‌మూరి వార‌సులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajya Sabha : రాజ్య‌స‌భ సీట్ల భ‌ర్తీలో కూట‌మి ప్ర‌భుత్వానికి స‌మ ప్రాధాన్యం.. లైన్‌లో మెగా, నంద‌మూరి వార‌సులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 October 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajya Sabha : రాజ్య‌స‌భ సీట్ల భ‌ర్తీలో కూట‌మి ప్ర‌భుత్వానికి స‌మ ప్రాధాన్యం.. లైన్‌లో మెగా, నంద‌మూరి వార‌సులు..!

Rajya Sabha : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సాఆర్‌సీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు (మోపిదేవి, మస్తాన రావు, క్రిష్ణయ్య) ఇప్పటికే రాజీనామా చేశారు. ఆ ఖాళీల భర్తీకి ఏపీలో కూటమి ప్ర‌భుత్వం కసరత్తు చేస్తుంది. ముగ్గురు సభ్యుల ఎంపిక పైన సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పవన్, బీజేపీతో నాయకత్వంతో చర్చిస్తున్నారు. అందులో భాగంగా మొద‌ట‌ రెండు సీట్లు టీడీపీకి, ఒకటి జనసేనకు ఇవ్వాలని భావించినా.. మూడు పార్టీలకు ఒక్కో సీటు ఖరారు దిశగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. అభ్యర్ధుల ఎంపిక సైతం దాదాపు కొలిక్కి వచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

Rajya Sabha జ‌న‌సేన నుంచి మెగా బ్రదర్ ?

రాజీనామా చేసిన‌ వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో మస్తాన్‌రావు, మోపిదేవి టీడీపీలో చేరారు. మస్తాన్‌రావుకు తిరిగి రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ ఉంది. ముగ్గురూ బీసీ వర్గాలకు చెందిన వారు కావడ‌తో ఇప్పుడు కొత్తగా రాజ్యసభకు పంపేవారి విషయంలో కూటమి నేతలు ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో మూడు స్థానాలు వీరికే దక్కనున్నాయి. అందులో భాగంగా జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు దాదాపు ఖరారైన‌ట్లుగా స‌మాచారం.

Rajya Sabha టీడీపీ నుంచి నంద‌మూరి సుహాసిని?

టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ రేసులో ఉన్న‌ప్ప‌టికీ నందమూరి సహాసిని పేరు ప్ర‌ముఖంగా పరిశీలనలో ఉంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత దిశగా ఈ ప్రతిపాదన అని సమాచారం. ఇదే సమయంలో గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు సైతం వినిపిస్తున్నాయి.

Rajya Sabha రాజ్య‌స‌భ సీట్ల భ‌ర్తీలో కూట‌మి ప్ర‌భుత్వానికి స‌మ ప్రాధాన్యం లైన్‌లో మెగా నంద‌మూరి వార‌సులు

Rajya Sabha : రాజ్య‌స‌భ సీట్ల భ‌ర్తీలో కూట‌మి ప్ర‌భుత్వానికి స‌మ ప్రాధాన్యం.. లైన్‌లో మెగా, నంద‌మూరి వార‌సులు..!

ఇక బీజేపీకి ఒక సీటు ఇవ్వాలనే ప్రతిపాదన సైతం ఉంది. త్వరలో వైసీపీ నుంచి మరో రాజ్యసభ సభ్యుడి రాజీనామా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. అదే జరిగితే బీజేపీకి అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే బీజేపీకి ఈ మూడు స్థానాల్లోనే ఒకటి ఇవ్వాలని తాజాగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి సీటు ఖాయమైతే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దక్కే ఛాన్స్ ఉందని పార్టీలో ప్ర‌చారం కొన‌సాగుతుంది. ఏదిఏమైన‌ప్ప‌టికీ అభ్యర్ధుల తుది ఎంపిక పైన మూడు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది