YS Jagan Mohan Reddy – Chandrababu : గోదావరి జిల్లాల మీదనే నమ్మకం పెట్టుకున్న చంద్రబాబు, వైఎస్ జగన్.. ఎవరిని గెలిపిస్తారో గోదారోళ్లు?
ప్రధానాంశాలు:
ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలు
2014 లో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్
2019 లో చతికిల పడ్డ టీడీపీ
YS Jagan Mohan Reddy – Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమరం మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అయితే.. ఏపీలో ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేసేవి మాత్రం గోదావరి జిల్లాలు అనే చెప్పుకోవాలి. ఇప్పుడే కాదు.. చాలా సంవత్సరాల నుంచి గోదావరి జిల్లాలే ఏపీ రాజకీయాలను శాసించాయి అనే చెప్పుకోవాలి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు 34 మాత్రమే. కానీ.. ఆ నియోజకవర్గాల రిజల్టే స్టేట్ అంతా ప్రభావం చూపిస్తుంది. ఏపీలో గోదావరి జిల్లాలు అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఎవరి వైపు మొగ్గు చూపించబోతున్నాయి.. ఎవరికి ఈ జిల్లాల ప్రజలు పట్టం గట్టబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
ఈ 34 నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి ఫేవర్ గా ఉంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఫేవర్ గా ఉన్నారు. ఓ 30 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఓ 4 నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా అయితే టీడీపీ లేదా వైసీపీ గెలుస్తుందని సర్వేల ద్వారా తెలుస్తోంది. కానీ.. మిగితా ఆ 30 నియోజకవర్గాల్లో మాత్రం ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పలేకపోతున్నాయి సర్వేలు. 2014 లో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ చతికిలపడింది. మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంటుందా? అనేది డౌటే అని చెప్పుకోవాలి.
YS Jagan Mohan Reddy – Chandrababu : ఉభయ గోదావరి జిల్లాలపై వైసీపీ, టీడీపీ ఫోకస్
ఈసారి టీడీపీ కూడా ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టింది. 2014 లాంటి రిజల్ట్స్ మళ్లీ రిపీట్ కావాలని భావిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తే టీడీపీ ఈసారి ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే అధికార వైసీపీ పార్టీని ఓడించి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తే రాష్ట్రంలో మిగితా నియోజకవర్గాల్లో కనీసం 50 నుంచి 60 సీట్ల వరకు గెలిచినా టీడీపీ ఈజీగా వచ్చే ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుంది.