Gold prices : గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే..!
ప్రధానాంశాలు:
Gold prices : గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే..!
Gold prices : ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయి, సామాన్య ప్రజలకు భారం అయ్యాయి. పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు అనేది సాంప్రదాయంగా జరుగుతుంది. అయితే పెరిగిన ధరల వల్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు బంగారం ధరలు తిరిగి తగ్గుముఖం పట్టడం, కొనుగోలుదారులకు ఓ ఊరటను కలిగిస్తోంది. నేటి బంగారం ధరల ప్రకారం ఒక్క తులంపై రూ.600 వరకు తగ్గుదల కనిపించింది, ఇది బంగారం కొనాలనుకునేవారికి నిజంగా మంచి సమయం.

Gold prices : గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే..!
Gold prices : బంగారం కొనుగోలు చేయాలనీ అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడే ఛాన్స్
బంగారం ధరల తగ్గుదలకి కారణాలు అనేకం. ప్రపంచ రాజకీయ పరిణామాలు, డాలర్ మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లోని మార్పులు , ఇవన్నీ ధరలపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆర్ధిక వాతావరణం, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత వల్ల బంగారం ధరలు మెల్లగా తగ్గుతుండటంతో, నిపుణులు దీని కొనసాగింపు పై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పసిడి ప్రియులు ఈ సమయంలో గోల్డ్ షాపింగ్ చేయడం లాభదాయకమని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.82,250గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.89,730గా ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.67,300గా నమోదైంది. ఇదే ధరలు వరంగల్, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వెండి ధరలు కూడా తగ్గి ప్రస్తుతం కేజీకి రూ.94,000 (చెన్నై, హైదరాబాద్ లో రూ.1,03,000)గా ఉంది. ఈ తగ్గుదల కొనుగోలు చేసేవారికి పండగలా మారిందని చెప్పొచ్చు.