2300 ఎకరాల HCU భూమిను.. ఇప్పుడు ఎంతకు చేసారు..? ఎందుకు లాగేసుకున్నారు..? ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉంది..?
ప్రధానాంశాలు:
2300 ఎకరాల HCU భూమిను.. ఇప్పుడు ఎంతకు చేసారు..? ఎందుకు లాగేసుకున్నారు..? ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉంది..?
HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ hyderabad central university (HCU) స్థాపనకు 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం 2,300 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, గత కొన్నేళ్లుగా వివిధ ప్రాజెక్టుల కోసం ఈ భూమిలో కొంతభాగాన్ని ఇతర ఉపయోగాలకు కేటాయించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయానికి సుమారు 1,800 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు లెక్కలు చెబుతున్నాయి.

2300 ఎకరాల HCU భూమిను.. ఇప్పుడు ఎంతకు చేసారు..? ఎందుకు లాగేసుకున్నారు..? ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉంది..?
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాల విశ్వవిద్యాలయ భూమిని వేలం వేసేందుకు ప్రయత్నించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, పర్యావరణ ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు గురైంది. విద్యార్థులు ఈ భూమి యూనివర్శిటీకి చెందినదని వాదిస్తూ, దీనిని కాపాడేందుకు నిరసనలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయంతో క్యాంపస్ పరిసరాల్లో జీవ వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ భూవివాదం కొత్తది కాదు. గతంలో కూడా యూనివర్శిటీ భూసమస్యలు ఎదుర్కొంది. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 400 ఎకరాలను క్రీడా ప్రాజెక్టుల కోసం వేరుగా కేటాయించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో భూకబ్జాలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాజా భూవివాదంపై తెలంగాణ హైకోర్టు 2024లో తీర్పునిచ్చి, ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టతనిచ్చింది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఈ భూమిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే అవకాశం లభించింది. అయితే విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు