Indian Soldier : భారత సైనికుడికి ఇచ్చే జీతం ఎంత..? కేంద్రం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో తెలుసా..?
ప్రధానాంశాలు:
Indian Soldier : భారత సైనికుడికి ఇచ్చే జీతం ఎంత..? కేంద్రం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో తెలుసా..?
Indian Soldier : పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం సమయంలో భారత సాయుధ బలగాలు చూపించిన ధైర్యసాహసాలు దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. అలాంటి ఘనమైన సేవలందిస్తున్న భారత సైనికుల జీవన పరిస్థితులు, వారికి లభించే జీతాలు, ఇతర సౌకర్యాల గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక దళాల్లో ఒకటైన భారత ఆర్మీలో జవాన్ స్థాయి నుంచి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వరకు ప్రతి ర్యాంక్‌కు ఎంతో ప్రత్యేకం. 2024 లెక్కల ప్రకారం.. ఒక సాధారణ సైనికుడు సుమారు రూ. 25,000 వేతనం పొందుతాడు. ల్యాన్స్ నాయక్‌కు రూ. 30,000, నాయక్‌కు రూ. 35,000, హవల్దార్‌కు రూ. 40,000 వేతనం ఉంటుంది.

Indian Soldier : భారత సైనికుడికి ఇచ్చే జీతం ఎంత..? కేంద్రం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో తెలుసా..?
Indian Soldier : అసలు భారత సైనికుడికి ఎంత జీతం వస్తుందో..? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో..? మీకు తెలుసా..?
సేనలోని హయ్యర్ ర్యాంకులవారికి వేతనాలు మరింత పెరుగుతాయి. నాయబ్ సుబేదార్‌కు రూ. 45,000, సుబేదార్‌కు రూ. 50,000, సుబేదార్ మేజర్‌కు రూ. 65,000 వేతనం లభిస్తుంది. అధికారి స్థాయిలో లెఫ్టినెంట్‌కు రూ. 68,000, కెప్టెన్‌కు రూ. 75,000, మేజర్‌కు లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది. లెఫ్టినెంట్ కల్నల్ రూ. 1,12,000, కల్నల్ రూ. 1,30,000, బ్రిగేడియర్ రూ. 1,39,000 నుంచి రూ. 2,27,000 వరకు వేతనం పొందుతారు. టాప్ ర్యాంక్‌లలో మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్‌లకు రూ. 2 లక్షలకు పైగా జీతం లభిస్తుంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు నెలకు రూ. 2.5 లక్షల వేతనం లభిస్తుంది.
వేతనాలతో పాటు, సైనికులకు అనేక రకాల భత్యాలు, అలవెన్సులు లభిస్తాయి. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్, మిలిటరీ సర్వీస్ పే, ఇంటి అద్దె అలవెన్స్‌తో పాటు ఫీల్డ్ ఏరియా అలవెన్స్, హై అల్టిట్యూడ్ భత్యం, స్పెషల్ డ్యూటీ అలవెన్స్‌లు ఉంటాయి. ఇంకా మెరుగైన వైద్య సౌకర్యాలు, రిటైర్మెంట్ తర్వాత పింఛన్, ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తారు.