Salute to soldier : సియాచిన్… ప్రతిరోజూ యుద్ధమే.. ఓ సైనికుడా వందనం
Salute to soldier : మన దేశంలో అతి శీతలమైన ప్రదేశం సియాచిన్.. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన యుద్దభూమి ఏమిటంటే ఖచ్చితంగా సియాచిన్ అనే చెప్పాలి. సియాచిన్ గ్లేసర్ వద్ద యుద్ధం చేయటమే కాదు ఊపిరి తీసుకోవటం కూడా ఛాలా కష్టమైన పని. ఇక్కడ చలికి గుడ్లు, టమోటాలు కూడా నిమిషాల వ్యవధిలో రాళ్లుగా మారిపోతాయి, సియాచిన్ లో ప్రతిరోజూ ఒక యుద్ధమే, ఒక వైపు శత్రుదేశం సైనికులు. మరోవైపు మైనస్ 50 డిగ్రీల చలిలో పనిచేయాల్సి ఉంటుంది.
Salute to soldier : నిద్రపోతే ప్రాణాలు పోయినట్లే
ఇక్కడ ఉండే సైనికుల్లో లైంగిక శక్తి తగ్గటం, మతి మరుపు అనేది సర్వసాధారణం. ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఈ యుద్ధభూమిని 1984 ఏప్రిల్ 13 నా భారతీయ సైనికులు పాక వేశారు. దేశం సరిహద్దులను కాపాడటం కోసం ప్రాణాలు ఒడ్డిమరి అక్కడ కాపలా కాస్తున్నారు. సియాచిన్ అంటే గులాబీల లోయ అని అర్ధం. సియాచిన్ లో భారతీయుల చిట్టచివరి క్యాంపుని “ఇంద్రకాల్” అని పిలుస్తారు. బేస్ క్యాంపు నుండి అక్కడికి చేరుకోవటానికి సైనికులు 20 నుండి 22 రోజులు పాటు మంచులోనే నడవాల్సి ఉంటుంది.
అక్కడ అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా కష్టం. అడుగడుగునా లోయలు, మంచు చరియలు ఎప్పుడు విరిగిపడుతాయో తెలియని పరిస్థితి. దీనితో సైనికులు ఒకరికి ఒకరు నడుముకు తాడ్లు కట్టుకొని మరి ప్రయాణం చేస్తారు. అక్కడ ఆక్సిజన్ సరిగ్గా ఉండదు కాబట్టి, కనీసం గాలి పీల్చుకోవటం కూడా కష్టం అవుతుంది. అందుకే ఎక్కడెక్కడ ఎంత సేపు ఆగాలి.. ఎంత సమయానికి ఎక్కడికి చేరుకోవాలి అనేవి అక్కడ రాసి ఉంటాయి. ఖచ్చితంగా వాటిని అమలుచేస్తూ ముందుకు సాగాలి.
అక్కడ మంచు మీద పడే సూర్యకిరణాలను నేరుగా చూసిన కానీ కంటి పొరకు ఇబ్బందులు తప్పవు. సైనికులు అక్కడ చెక్క బల్లలు పై స్లీపింగ్ బాగ్స్ లో పడుకుంటారు, అక్కడ కాసేపు హాయిగా నిద్రపోవటం కూడా ప్రాణానికి ప్రమాదం. ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా అందదు కాబట్టి, నిద్ర కూడా ఎక్కువ సమయం పడుకోకూడదు. అందుకే అక్కడ పనిచేసే గార్డ్ లు సైనికులను మధ్య మధ్యలో నిద్ర లేపుతారు. అక్కడ మంచుకి చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది. సేవింగ్ చేసుకుంటే చర్మం ఊడిరావటం ఖాయం, ఇక స్నానం అంటారా..? దాని గురించి వాళ్లకు ఊహే ఉండదు.
ఇలాంటి కష్టమైన ప్రాంతంలో ఒక్కో సైనికుడికి మూడు నెలలు పోస్టింగ్ ఉంటుంది. ఈ మూడు నెలలు ఎక్కడ కాపలా కాయమంటే అక్కడ వుండల్సిందే..? పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం ఉండటంతో అక్కడ సైనికులకు పెద్దగా పని ఉండదు. ఉన్నంత సేపు ఖాళీగా ఉండటంతో, కాకపోతే అక్కడి వాతావరణంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది.
సియాచిన్ ను గస్తీ కాయటంలో వైమానిక దళం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ సైనికులను దించే హెలికాఫ్టర్లు ఒకే చోట 30 సెకన్లు కంటే ఎక్కువ టైం ఆగవు. శత్రువు దాడి చేయటానికి సిద్దమైయ్యే సమయం కూడా ఇవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ విధంగా చేస్తారు. ఇన్ని వ్యయ ప్రయాసలు పడి మరి అక్కడ దేశ రక్షణ కోసం మన సైనికులు నిరంతరం కాపలా కాస్తూ వుంటారు.