Indian Army : పాక్ కు చెమటలు పట్టిస్తున్న భారత సైన్యం.. పేకమేడలా కూలుతున్న ఉగ్రవాదుల ఇల్లులు..వీడియో !
ప్రధానాంశాలు:
Indian Army : పాక్ కు చెమటలు పట్టిస్తున్న భారత సైన్యం.. పేకమేడలా కూలుతున్న ఉగ్రవాదుల ఇల్లులు..వీడియో !
Indian Army : జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల వేటను ముమ్మరం చేశాయి. ఈ దాడికి సహకరించిన స్థానిక ఉగ్రవాదులపై చర్యలు ప్రారంభించి, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. శనివారం రాత్రి మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో మొత్తం తొమ్మిది ఇళ్లను కూల్చివేసిన భద్రతా బలగాలు, 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Indian Army : పాక్ కు పట్టిస్తున్న భారత సైన్యం.. పేకమేడలా కూలుతున్న ఉగ్రవాదుల ఇల్లులు..!
Indian Army ఉగ్రవాదులకు సహకరించిన ఇళ్లపై దాడులు
బందిపోరా, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమైన వారి ఇళ్లను కూల్చివేశారు. కుప్వారా జిల్లాలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ తడ్వా ఇంటిని బాంబులతో పేల్చివేశారు. పుల్వామాలో ఆమీర్ నజీర్ ఇంటి ధ్వంసం, బందిపోరాలో లష్కరే తొయిబా ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని కూల్చడం వంటి చర్యలు చేపట్టారు. ఇటీవలి 48 గంటల్లో ఎవరైతే ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నారో వారి ఇళ్లను ధ్వంసం చేసి భద్రతా బలగాలు గట్టి బహిరంగ హెచ్చరిక ఇచ్చాయి.
కుల్గాం, షోపియాన్ జిల్లాల్లో కూడా ఉగ్రవాద మద్దతుదారుల ఇళ్లను ధ్వంసం చేశారు. అదిల్ హుస్సేన్ థోకర్ వంటి ఉగ్రవాదులకు సహకరించిన వారి ఇళ్లను కూల్చి, చుట్టుపక్కల ఇళ్లకు నష్టం కలగకుండా నియంత్రిత మార్గంలో చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, బందిపోరాలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతమయ్యాడు. భద్రతా బలగాల ప్రకారం, ఉగ్రవాద మద్దతుదారులపై చర్యలు ఇంకా కొనసాగనున్నాయి.
మరో ఉగ్రవాది ఇళ్లు ధ్వంసం చేసిన భారత్ సైన్యం.
J&Kలోని బందిపొరా, త్రాల్లో ఉన్న టెర్రరిస్టులు జమీల్ అహ్మద్, ఆమిర్ నజీర్ నివాసాలను బాంబులతో పేల్చేసింది.
వీటితో కలిపి ఇప్పటివరకు 9 మంది ఉగ్రవాదుల ఇళ్లను ఆర్మీ నేలమట్టం చేసింది#PahalgamTerroristAttack #JammuAndKashmir pic.twitter.com/uyGeib8P9R
— greatandhra (@greatandhranews) April 27, 2025