Pawan Kalyan : పాపం పవన్ కళ్యాణ్ కష్టం చూస్తే వైసీపీ వాళ్లకి కూడా జాలి వేస్తోంది !
Pawan Kalyan : అయ్యో పాపం అనిపిస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే. ఎందుకంటే.. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో.. ఏం చేస్తున్నారో.. ఆయన వారాహి యాత్ర ఏంటో.. ఆయన బాధ ఏంటో.. చాలామందికి అంతుపట్టడం లేదు. అసలు ఆయనకు రాజకీయాలంటేనే తెలియదు. రాజకీయాల్లో ఓనమాలు కూడా రావు. అయినా తనకే రాజకీయాలు తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అందుకే ఆయన్ను చూసి చాలామంది రాజకీయ నాయకులు అయ్యో పాపం అనుకుంటున్నారు.అసలు పవన్ కళ్యాణ్ కు విమర్శలు చేయడం కూడా రాదు. వారాహి యాత్రలో ఏదో అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారు కానీ.. అవి అసలు జనాలకు ఎక్కడం లేదు.
ఆయన ఒక్కసారి విమర్శిస్తే.. వైసీపీ నేతలు వందమంది ఆయన మీద తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. ఆ కౌంటర్స్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడాల్సిన పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్ కు.చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు అనే ట్యాగ్ ను పవన్ తనకు తానే తగిలించుకున్నట్టు అయింది. దానికి కారణం.. ఆయన ప్రవర్తించే తీరే. వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను దత్త పుత్రుడు అంటూ ఆటపట్టిస్తుంటారు. దత్త పుత్రుడు అంటూ అంతలా పరువు తీస్తున్నా.. పవన్ మాత్రం తాను దత్త పుత్రుడిని కాదని నిరూపించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏపీలో ఎవ్వరిని అడిగినా దత్త పుత్రుడు అంటే ఎవరు అంటే టక్కున పవన్ పేరు చెబుతారు.
Pawan Kalyan : దత్త పుత్రుడు అనే బిరుదును తగిలించుకున్న పవన్
జనసేన పార్టీలో ఎవరైనా నిఖార్సయిన లీడర్ ఉన్నారా అంటే అదీ లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే అధికార పార్టీని విమర్శించాలి. నాగబాబు, నాదెండ్ల మనోహర్ లాంటి ఒకరిద్దరు నేతలు ఉన్నా.. వాళ్లు మాట్లాడితే వైసీపీ నేతలు నోర్మూసుకోరు. ఇంకొంచెం రెచ్చిపోయి మరీ.. వాళ్లపై ఎదురు దాడి చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి.. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు కానీ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో… ఎన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందో ఆయనకు తెలియదా? ఏపీ ప్రజలంతా ఇప్పుడు సీఎం జగన్ వైపు ఉన్నారు.. అలాంటి సమయంలో పవన్ మాటలను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.