Jagan Mohan Reddy : జగన్ ఇచ్చిన మూడు హామీలే ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నాయా…!
ప్రధానాంశాలు:
Jagan Mohan Reddy : జగన్ ఇచ్చిన మూడు హామీలే ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నాయా...!
Jagan Mohan Reddy : ఐదేళ్ల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఇప్పుడు కనీసం ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయాడు. ఆయన ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయకపోవడంతో జగన్ కి ఈ సారి అధికారం అందించలేదు ఏపీ ప్రజలు. దీంతో వచ్చే ఏడాది అయిన అధికారం దక్కించుకోవాలనే కసితో ఆయన ఉన్నారు. అయితే గతంలో జగన్ ఇచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చలేదనే టాక్ ఇప్పుడు ఉంది. దీంతో జగన్ మళ్లీ అధికారంలోకి రాగలడా అని కొందరి నుండి వస్తున్న ప్రశ్న. మరి అమలు పరచని హామీలకి జగన్ ఎలాంటి సమాధానం ఇస్తాడు, వారిని ఎలా కూల్ చేస్తాడు, వెళ్లిపోయిన నాయకులని మళ్లీ తన దగ్గరకి ఎలా తెచ్చుకుంటాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
Jagan Mohan Reddy జగన్ ముందున్న సవాళ్లు..
2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతానికి పైగా పూర్తిచేశానని జగన్ చెప్పగా, సీపీఎస్ రద్దు, పోలవరం, మద్య నిషేధం, ప్రత్యేకహోదా సాధన, మెగా డీఎస్సీతో సహా వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞం పూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తికానివి ఎన్నో ఉన్నాయి. అయినా 99 శాతానికి పైగా హామీలు అమలు చేశానని ఎంత పచ్చిగా అవాస్తవాలు వల్లెవేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మెగా డీఎస్సీ. ఇది లక్షలాది మంది నిరుద్యోగులకు కలలు రేపిన జగన్ కీలక హామీ. 2019లో అధికారంలో రాగానే నెరవేరుస్తానన్న హామీ. కానీ, ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేకపోయారు. సీపీఎస్ రద్దు అనేది ఉద్యోగులకు సంబంధించిన కీలక హామీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ రద్దుపై కూడా జగన్ హామీ ఇచ్చారు.
విడతల వారీగా మద్య నిషేధం ఎవరు కోరని హామీ. కాని ఆయనే ఈ హామీని ఇచ్చారు.దీనిని నెరవేర్చకపోగా.. నాసిరకం మద్యం విక్రయించారు. ఇది మందుబాబులకే కాదు.. వారి భార్యలకు కూడా కోపం తెప్పించింది. సో.. ఈ మూడు హామీలు జనాలు మరిచిపోలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. జగన్‌కు ఈ మూడు హామీల సెగలు తగులుతూనే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి జగన్ వాటిని ఎలా మేనేజ్ చేసి తిరిగి మళ్లీ పూర్వ వైభవం ఎలా సంపాదిస్తాడు అనేది.