సొంత పార్టీ కీలక నేతకు ఊహించని షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ ?

0
Advertisement

ఆయన వైసీపీలో ఒక కీలక నేత.. గతంలో వైసీపీ ప్రతిపక్షములో ఉన్నప్పుడు జగన్ టీంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి.. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గం నుండి గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు కానీ, కొన్ని అనివార్య కారణాలు వలన మంత్రి పదవి రాలేదు, అయినాసరే దాని గురించి ఎప్పుడు ఆయన బహిరంగంగా బాధ పడిన సందర్భాలు లేవు. ఎప్పటికప్పుడు వైసీపీ తరుపున బలమైన వాణి వినిపించే నేతగా పేరుపొందిన నేతకు సొంత సర్కార్ నుండి ఒక రకమైన షాక్ తగిలిందని చెప్పాలి.

ycp

ఆ ఎమ్మెల్యే సహకారంతో అక్రమ మైనింగ్ జరుగుతోందని గతంలో అదే పార్టీకి చెందిన కొందరు హైకోర్టులో  పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే కూడా ఊహించని అఫిడవిట్‌ను ప్రభుత్వం దాఖలు చేసింది. దర్యాప్తు కోసం కమిటీ వేశామని .. అక్రమ మైనింగ్ జరిగిందని గుర్తించామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. క్రిమినల్ కేసులు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇప్పటి వరకూ ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదిస్తూ వచ్చిన సర్కార్,  హఠాత్తుగా దర్యాప్తు కమిటీ వేశామని అక్రమ మైనింగ్ నిజమేనని చెప్పడంతో ఆ ఎమ్మెల్యేకు షాక్ తగిలినట్లయింది. ఈ కేసు మెల్లగా “ఆ”కీలక నేత వైపు వస్తుందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే… ప్రధానంగా అక్రమ మైనింగ్ జరుగుతోంది ఆ నేత అండతోనేనని.. పిటిషన్లు ఆరోపిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ కు ఇబ్బందులు తప్పవు అని తెలుస్తుంది.

సొంత పార్టీ నుండే ఫైర్ బ్రాండ్ కు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం పట్ల రాజకీయ లక్ష్యాలు వేరే ఉన్నట్లు కొందరు అంటున్నారు. ఇప్పటివరకు అయితే జగన్ కు భజన తప్ప, వ్యతిరేకంగా ఒక్క మాట్లాడలేదు ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్, అలాంటిది ఆయనకు ఉచ్చు బిగించటం ఏమిటో అర్ధం కావటం లేదంటున్నారు  ఆయన అనుచరులు, ఇంతకీ ఆ కీలక లేదు ఎవరయ్యా అంటే “కెమెరా మెన్ గంగ తో ……… ” అని గుసగుసలు వినిపిస్తున్నాయి..ఇక నిజమెంతో ఆ జగన్మోహనుడికే తెలియాలి.

Advertisement