Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆవేశం చూసారా.. అలా అనడం వెనక కారణం ఉందా?
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉన్నాయి. అవును.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. సీఎం జగన్ పైనే కాకుండా తాజాగా.. వాలంటీర్ల మీద కూడా సంచలన ఆరోపణలు చేశారు సీఎం జగన్. అసలు.. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్స్ కు వాలంటీర్లే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యం కాగా.. అందులో ఇప్పటి వరకు 14 వేల మంది ఆచూకీ తెలియలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే అసలు సీఎం పదవికే జగన్ అర్హుడు కాదదు.. అసలు వైసీపీ ప్రభుత్వమే రాష్ట్రానికి సరేనది కాదంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అసలు.. జగన్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం లేదన్నారు. నిజానికి.. వాలంటీర్ల వ్యవస్థను చాలా మంది పొగిడారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ వ్యవస్థ పైనే పలు ఆరోపణలు చేశారు.వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఉన్నారు. ఎంత మంది మహిళలు ఉన్నారు. అందులో వితంతువులు ఎంతమంది.. అంటూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆరా తీస్తున్నారంటూ పవన్ విమర్శించారు.
Pawan Kalyan : అసలు వాలంటీర్ల వ్యవస్థను అందుకే తీసుకొచ్చారా?
ఈ సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందే కాగ్ లెక్కలే చెబుతున్నాయి. అన్నీ అక్రమాలే. ప్రభుత్వ భారీ దోపిడికి తెర తీసింది. నేను ముఖ్యమంత్రి పీఠానికి విలువ ఇచ్చే వాడిని కానీ.. దాని మీద కూర్చొన్న జగన్ కు కాదు. నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు. నన్ను పర్సనల్ గా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు.