Junior NTR : నాకు రాజకీయాల కన్నా మీరే ఎక్కువ.. ఏపీ రాజకీయాలపై నా నిర్ణయం ఇదే.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Junior NTR : నాకు రాజకీయాల కన్నా మీరే ఎక్కువ.. ఏపీ రాజకీయాలపై నా నిర్ణయం ఇదే.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :9 October 2023,11:00 am

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆయన ఎందుకు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు అని. చంద్రబాబు అంటే నందమూరి కుటుంబానికి కావాల్సిన వ్యక్తి. నందమూరి కుటుంబ సభ్యులు అందరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. దానికి కారణాలు ఏంటి అనేవి విశ్లేషిస్తే.. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టంగా రాజకీయాల గురించి చెప్పారు. ఆయన అప్పుడే చెప్పారు కానీ.. ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలుసా? అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నేను మీఅందరికీ చిన్న విన్నపం చేస్తున్నాను. నేను బాధపెట్టాను అని కాదు. ఒక్కొక్కసారి సినిమాలు చేసేటప్పుడు నిజంగా చెప్పడానికి ఏం ఉండదు. ప్రతి సారి ఏం చెప్పడానికి ఉండదు. మేము ఎలాంటి అప్ డేట్ ఎప్పటికీ ఇవ్వలేం. మీ ఆరాటం నాకు అర్థం అవుతోంది. దాని వల్ల మనం ప్రొడ్యూసర్ల పైన, దర్శకుల పైన ప్రెజర్ ఇవ్వాల్సి వస్తోంది. అభిమానులు అప్ డేట్ కోరుకుంటున్నారు అని ఏది పడితే అది చెప్పలేం. ఇది కేవలం నా ఒక్కరికే కాదు.. చాలామంది ఇదే ప్రెజర్ కు గురవుతున్నారు. దయచేసి ఏదైనా అప్ డేట్ ఉంటే ఇంట్లో ఉన్న భార్య కంటే ముందే మీకు చెబుతాం. నేను నా గురించే కాదు.. నా లాగే ఉండే ఎంతో మంది నటీనటుల గురించి చెబుతున్నా. అదిరిపోయే అప్ డేట్ ఉంటేనే మీకు చెబుతాం. మీరు ఎక్కడో చదివిన వార్తలను నమ్మకండి.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు.

junior ntr reacts on balakrishna comments

#image_title

Junior NTR : ప్రొడ్యూసర్ల మీద అప్ డేట్ అంటూ ప్రెజర్ పెట్టకండి

ఈ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం సినిమాలు తీయాలి. ప్రొడ్యూసర్ల మీద అప్ డేట్ అంటూ ప్రెజర్ పెట్టకండి. త్వరలోనే తన కొత్త మూవీ షూటింగ్ ప్రారంభిస్తాం అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు. మాకు మీరు చాలా విలువైన మనుషులు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది