YS Avinash Reddy : వాదనలతో దద్దరిల్లిన హైకోర్టు.. వైఎస్ అవినాష్ రెడ్డికి అనుకూలంగా జడ్జిగారు తీర్పు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Avinash Reddy : వాదనలతో దద్దరిల్లిన హైకోర్టు.. వైఎస్ అవినాష్ రెడ్డికి అనుకూలంగా జడ్జిగారు తీర్పు..!

YS Avinash Reddy : ఏపీకి చెందిన టాప్ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు తెలంగాణకు పాకింది. ఇన్ని రోజులు ఏపీలో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు ఈ కేసు తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనూ ఆయన పలు పిటిషన్లు వేసినా కోర్టు పట్టించుకోకపోవడంతో మళ్లీ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 April 2023,9:00 pm

YS Avinash Reddy : ఏపీకి చెందిన టాప్ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు తెలంగాణకు పాకింది. ఇన్ని రోజులు ఏపీలో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు ఈ కేసు తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనూ ఆయన పలు పిటిషన్లు వేసినా కోర్టు పట్టించుకోకపోవడంతో మళ్లీ ఇవాళ ఆయన మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

kadapa mp ys avinash reddy petition in telangana high court

kadapa mp ys avinash reddy petition in telangana high court

తనపై సీబీఐ విచారణ చేస్తోంది కానీ.. దానికి సంబంధించి ఎలాంటి వీడియో, ఆడియోను రికార్డు చేయడం లేదని.. దానిపై హైకోర్టు తీర్పు చెప్పాలంటే పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐకి అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అదే అంశంపై మరోసారి కోర్టుకు ఎక్కారు అవినాష్. విచారణకు సంబంధించిన రికార్డును తనకు ఇవ్వాలంటూ హైకోర్టు మెట్లు ఎక్కారు.

Andhra Pradesh High Court adjourns judges' abuse case by four weeks - The  Hindu

YS Avinash Reddy : విచారణ రికార్డుపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో?

గతంలో సీబీఐ విచారణ చేసే సమయంలో తన వీడియో, ఆడియోను రికార్డు చేయాలని కోరారు వైఎస్ అవినాష్ రెడ్డి. దీంతో సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఆ తర్వాత మార్చి 14న తనపై విచారణ చేసిన ఆడియో, వీడియో రికార్డులను తనకు ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి కోర్టును మరోసారి కోరారు. కానీ.. కోర్టు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి మధ్యంతర పిటిషన్ ను తాజాగా ఫైల్ చేశారు అవినాష్. దానిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది