YS Avinash Reddy : కడప జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం… పోటీ పడుతున్న వై.యస్ కుటుంబం… గెలుపేవరిదో..!
ప్రధానాంశాలు:
YS Avinash Reddy : కడప జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం... పోటీ పడుతున్న వై.యస్ కుటుంబం... గెలుపేవరిదో..!
YS Avinash Reddy : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడప జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్నది వైయస్ వివేకానంద హత్య గురించి అని చెప్పాలి. మరీ ముఖ్యంగా పులివెందుల ప్రాంతం ప్రజలు రానున్న ఎన్నికల్లో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ కుటుంబ సభ్యులైన సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పోటీ చేయబోతున్నారు అనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వై.యస్ కుటుంబం ఈ విధంగా ఒక్కసారి మాత్రమే పోటీ చేశారని చెప్పాలి. అయితే గతంలో 2011లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ వైసీపీ పార్టీ తరఫున వై.యస్ వివేకానంద కాంగ్రెస్ తరపున పోటీపడ్డారు. అయితే ఇప్పుడు మరోసారి వై.యస్ కుటుంబం పోటీ పడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వై.యస్ వివకానంద రెడ్డి హత్య తర్వాత నెలకొన్న పరిస్థితులను గత ఎన్నికల్లో రాజకీయంగా వాడుకున్న వైసీపీ పార్టీ కడప జిల్లాను క్లీన్ సీప్ చేసింది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.
ఎందుకంటే వివేకానంద రెడ్డి కుమార్తె వై.యస్ సునీత తన అన్న సీఎం జగన్ పై పోరుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఆ పోరు కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి. అయితే సునీత వివేకానంద హత్య కేసు పై హైకోర్టు వరకు వెళ్లి వచ్చారు. అయితే ఇక్కడ సిబిఐ విచారణ కూడా మెల్లిగా సాగడంతో దీనికి ముఖ్యమంత్రి జగన్ కారణం అంటూ వైయస్ సునీత పలు రకాల విమర్శలు చేశారు.అదేవిధంగా ఇప్పుడు తన అన్నను విభేదిస్తున్న వైఎస్ షర్మిల మరియు సునీత ఒకటయ్యారు. దీంతో కడప జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే వైయస్ షర్మిల మరియు వైయస్ సునీత కలిసి వైయస్ వివేకానంద వర్ధంతి సభను కూడా నిర్వహించారు. ఇక దీనిలో భాగంగానే వైసీపీకి ఓటు వేయొద్దు అంటూ ఆమె పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో దిగబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకే కుటుంబానికి చెందిన వారే ఒకరిపై ఒకరు పోటీకి దిగితే కడప జిల్లాలో వారి ప్రతిష్ట ఏం కావాలి అనేదానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల మరో రెండు రోజుల్లో ఇడుపులపాయికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఈ విషయాలు చర్చించబోతున్నారని తెలుస్తుంది. వివేక హత్య తర్వాత పరిస్థితులు అన్న జగన్ కు తను కు మధ్య విభేదాలకు గల కారణం ఇలాంటి అంశాలను వివరించి కుటుంబ సభ్యుల్ని తన పోటీకి ఒప్పిస్తారు… సపోర్ట్ కూడా కొరతారు అనే ప్రచారం జరుగుతుంది. మరో రెండు రోజుల్లో ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్ వద్ద తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు వైయస్ షర్మిల సిద్ధమవుతున్నారని వార్తలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైయస్ సునీత మరి వైఎస్ షర్మిల వివేకానంద హత్యకు కారణం అతడే అని ఆరోపిస్తున్న వైయస్ అవినాష్ పైనే పోటీ చేయడం అనేది రాజకీయ వర్గాలలో ఏ రకంగా మారబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.