KCR : మార్పులు చేర్పులపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ .. పార్టీ వ్యవస్థనే మార్చబోతున్న కేసీఆర్..!
ప్రధానాంశాలు:
KCR : మార్పులు చేర్పులపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ .. పార్టీ వ్యవస్థనే మార్చబోతున్న కేసీఆర్..!
KCR : బీఆర్ఎస్ లో పూర్తి నాయకత్వం మారబోతుంది. వర్కింగ్ స్టైల్ ని కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్ వారి పాత్ర కీలకమని క్లారిటీ ఇచ్చారు. పార్టీ వ్యవస్థలోను మార్పులు తెస్తామని చెబుతున్నారు. ఇక కేసీఆర్ కింది స్థాయి క్యాడర్ తో మాట్లాడుతున్నారు. తప్పెక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 60 నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ మాట్లాడాలని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి సమయం వెచ్చించాలని పార్టీని, క్యాడర్ ను పట్టించుకోలేదని, తప్పులు జరిగాయని, దిద్దుకుందామని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం కల్పిస్తున్నారు.మొత్తం ఎమ్మెల్యేల గుప్పెట్లో ఉండేదని ఆయన ఆశీస్సులు లేకపోతే పార్టీ కోసం కష్టపడిన వారికి కనీస ప్రయోజనం లభించలేదన్నారు. పార్టీ కోసం కాకుండా వారు సొంత గ్రూపును మెయింటైన్ కోసం ప్రయత్నించడంతో పార్టీకి క్యాడర్ కి మధ్య దూరం పెరిగిందని ఎక్కువమంది చెప్పారు. ఈసారి అలాంటి వారికి పరిస్థితి ఉండదని కేసీఆర్ వారికి చెబుతున్నారు. ఇక పార్టీ గ్రామస్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. లోక సభ ఎన్నికల అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల లోక్ సభ సన్నాహక సమావేశాలలో ఇకనుంచి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ కాకుండా, పార్టీ కేంద్రంగానే ఎమ్మెల్యేలు పనిచేసే విధానం తీసుకొస్తామని కేటీఆర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ లో భారీ మార్పులు ఖాయమని కేటీఆర్ అంటున్న మాటలు వెల్లడిస్తున్నాయి.అధికారంలో ఉన్ననాళ్ళు పార్టీ నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్ పెద్దగా దృష్టి సారించలేదు. కార్యకర్తలని పట్టించుకోలేదు. ఇది తన తప్పేనని కేటీఆర్ కూడా అంగీకరించారు. పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీకి సమయం ఇవ్వలేకపోయామని కేటీఆర్ సమర్ధించుకున్నారు. బీఆర్ఎస్ కు జిల్లాల పార్టీ అధ్యక్షులు, మండల, గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నా నామమాత్రమేనని అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. కార్యవర్గాల ఏర్పాటు కాగితాలకే తప్ప సమావేశాలు నిర్వహించే సంస్కృతి ఎప్పుడు మర్చిపోయారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జీలుగా వ్యవహరించడంతో వారిదే రాజ్యం అయింది. దీంతో క్యాడర్ కు లీడర్ కు దూరం పెరిగింది. కార్యకర్తల కష్టాలు ఏంటో తెలియకుండా పార్టీ వ్యవహారాలు నడిచాయి. ప్రోటోకాల్ పేరుతో తనను కార్యకర్తలను కలవనీయలేదని కవిత కూడా ఒకసారి గట్టిగా ఫైర్ అయ్యారు. లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావు సహా రాష్ట్ర నేతల ఉపన్యాసాల తర్వాత కొంతమంది క్యాడర్ కు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కార్యకర్తలు గ్రామం మండల నాయకుల అభిప్రాయాలు చాటే అవకాశం పూర్తి స్థాయిలో రాలేదు.
అదే సమయంలో కేసీఆర్ కేటీఆర్ సభల్లోను బీఆర్ఎస్ ముఖ్య కార్యక్రమాల్లోనూ, మీడియా సమావేశాల్లోను, చర్చా వేదికల్లోను ఎక్కడ చూసినా వేళ్ళ మీద లెక్కబట్ట గలిగే కొందరు నాయకులు ఎక్కువగా ఉండేవారు. వారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. వారిని దూరం పెడితేనే మంచిది అన్న భావన కార్యకర్తల్లో వినిపిస్తుంది. వారి స్థానంలో యువనాయకత్వానికి తొలిసారిగా గెలిచిన వారికి అవకాశాలు కల్పిస్తే పార్టీకి మేలు జరగవచ్చు అని అంటున్నారు. ఈసారి మాత్రం పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రామ మండల జిల్లా రాష్ట్ర శాఖల వరకు కొత్త తరం నాయకులకు ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా ఉన్న నాయకులకు ప్రాధాన్యం దక్కితే పార్టీకి పూర్వవైభవం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.