KCR : కెసిఆర్ అంటే అంతే మరి… మంత్రి అని కూడా చూడకుండా అందరి ముందు పరువు తీశాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కెసిఆర్ అంటే అంతే మరి… మంత్రి అని కూడా చూడకుండా అందరి ముందు పరువు తీశాడు

 Authored By mallesh | The Telugu News | Updated on :18 October 2021,5:00 pm

KCR : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్నది. ఈ 20 ఏండ్లలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేసిన కార్యక్రమాలు, విజయాలను వివరించేందుకు వరంగల్‌ను విజయగర్జన సభను నిర్వహించేందుకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం మొదలుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇదిలా ఉండగా వచ్చే నెల 15న వరంగల్‌లో టీఆర్ఎస్ విజయగర్జన సభ నిర్వహించబోతున్న విషయం తెలిసినదే.

kcr shocking comments on minister puvvada ajaykumar

kcr shocking comments on minister puvvada ajaykumar

KCR : కేసీఆర్ ఊహించని ప్రశ్న :

ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం కేసీఆర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విజయ‌గర్జన సభకు ప్రజలను బస్సుల్లో తరలించే అంశం చర్చకు వచ్చింది. ఈ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కేసీఆర్ ఊహించని విధంగా ఓ ప్రశ్న అడిగారు. రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయని పువ్వాడను సీఎం అడిగారు. ఇందుకు మంత్రి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారని సమాచారం. దీంతో సీఎం కాస్త అసహనానికి, ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. అదే సమయంలో అధికారులతో మాట్లాడి బస్సుల వివరాలు తెలుసుకునేందుకు మంత్రి పువ్వాడ సమావేశం నుంచి బయటకు వచ్చారు. అధికారులతో మాట్లాడి బస్సులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అసహనంతో ఉన్న సీఎం పువ్వాడ బస్సు వివరాలను తెలియజేయాలని చూసిన వాటిని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.

KCR : నేను రవాణా శాఖ మంత్రిని.. :

kcr shocking comments on minister puvvada ajaykumar

kcr shocking comments on minister puvvada ajaykumar

అనంతరం పువ్వాడ మాట్లాడుతూ తాను రవాణాశాఖ మంత్రిని అని ఆర్టీసీకి సంబంధించిన నిర్వహణ, బాధ్యతలను టీఎస్ఆర్టీసీ చైర్మన్ చూసుకుంటారని పువ్వాడ చెప్పడంతో అక్కడున్న వారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మొత్తంగా సభకు సుమారు 22 వేల బస్సులను నడపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందుకు 10 లక్షల మంది హాజరవుతారు అని అంచనా వేస్తున్నారు. సభకు ప్రజలను తరలించడానికి, విజయవంతం చేయడానికి పలువురికి సీఎం బాధ్యతలు అప్పగించారని తెలుస్తున్నది. ఇందులో భాగంగానే స్థల పరిశీలన, సభ నిర్వహణ, ప్రజల తరలింపు, మాట్లాడే అంశాలు, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే విషయాలు, సవాళ్లను ఎదుర్కొనే తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది