KCR VS Revanth Reddy : కొడకా కేసీఆర్ కొట్టే దెబ్బకు కొడంగల్‌లో కనిపించవ్.. రేవంత్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ అదుర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR VS Revanth Reddy : కొడకా కేసీఆర్ కొట్టే దెబ్బకు కొడంగల్‌లో కనిపించవ్.. రేవంత్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ అదుర్స్

KCR VS Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విషయం అంతా మీకు తెలుసు. మీకు తెలియకుండా ఏం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 October 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  అచ్చంపేట సభలో రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్

  •  తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినప్పుడు నువ్వు ఎక్కడున్నవు?

  •  కొడంగల్ లో కనిపించకుండా దెబ్బ కొడుతా?

KCR VS Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విషయం అంతా మీకు తెలుసు. మీకు తెలియకుండా ఏం లేదు. ఎన్నికల్లో ఏం జరుగుతదో కూడా మీకు తెలుసు. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు చూస్తున్నారు కదా. 24 ఏళ్లు అవుతోంది. నేను తెలంగాణ కోసం బయలుదేరి. 24 ఏళ్ల నాడు ఎవ్వడూ లేడు. ఎవ్వడూ ఏ చెట్టు కింద ఉన్నడో.. ఎవడు ఎక్కడో ఉన్నడో అందరికీ తెలుసు. ఇవాళ లేసినోడు.. లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నదా? కొడంగల్ కు రా అని ఒకడు. నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఇంకొకడు. ఇవా సవాళ్లు విసిరేది. ఇవేనా? ఇది రాజకీయం అయితదా? ఈ రాజకీయం అనుకోవచ్చునా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.

దయచేసి నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. ఎప్పుడైతే ప్రజలు గెలిచే పరిస్థితి వస్తుందో అప్పుడే బతుకులు బాగుపడతాయి. ఇవాళ నేను కొత్తగా మాట్లాడుతలేను.. తెలంగాణలో.. అచ్చంపేటలో. ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను నేను. ఆరోజు తెలంగాణ రాకముందు ఎవడెవడో.. ఎక్కడెక్కడ ఉన్నడో.. ఎవని బూట్లు తూడ్చిండో.. ఎవడు ఏ పని మీద ఉండెనో.. ఇవాళ మాట్లాడే సిపాయిలు అందరూ ఎక్కడ ఉందురో. ఒక పక్షిలాగ నేను ఒక్కడినే ఏవిధంగా ఊరు ఊరు, వాడ వాడ తిరిగి తిరిగి యావత్ తెలంగాణను ఒక బ్రహ్మాండమైన ఉద్యమ కెరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయినం. గడ్డకు పడ్డం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు డిండి ప్రాజెక్ట్ నుంచే వచ్చాను. అక్కడి నుంచి చాలా దూరం దుందుబి నది కనిపిస్తోంది. బాలరాజు కట్టించిన చెక్ డ్యామ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంతకుముందు దుందుబిలా దుమ్ము లేసిపోయింది. వాగు ఎండి పాయెరా.. పెద్ద పేగు ఎండిపాయెరా అని గోరటి వెంకన్న పాట రాసి ఏడ్చిండు. అటువంటి జిల్లా మన పాలమూరు జిల్లా. ఎంత బాధ. పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టినారు. అంబలి కేంద్రాలు పెట్టారు. గొంతులెండి 5 కిమీలు బిందెలు పట్టుకొని నీళ్లు మోసిననాడు, కరెంట్ కోసం అర్ధరాత్రి పూట పోయి పాములు, తేళ్లు కరిచి చచ్చిపోయిన ఘటనలు, బొంబయి బస్సు ఎక్కి బొంబయి పోయిన నాడు ఈ కొడుకులు ఒక్కరైనా ఉన్నడా? ఎవడైనా వచ్చిండా? రేపు ఉంటరా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

KCR VS Revanth Reddy : ఎన్నికలు రాగానే ఆగమాగం కాకండి

ఎన్నికలు రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు. ఎవ్వరు పడితే వాడు వత్తడు. ఏది పడితే అది చెబుతారు. నేను చెప్పే మాటలు మీరందరూ వినాలి. మీకు దండం పెట్టి చెబుతున్నా. తెలంగాణను కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన. ఒక పోరాటం నేను చేసినా. ఇప్పుడు మీరు చేయాలి పోరాటం. తెలంగాణ కోసం నేను వెళ్లిన నాడు.. ఎవ్వడికి కూడా నమ్మకం లేదు. ఎక్కడ వత్తది తెలంగాణ. వీడు ఒకడు మోపయిండు అన్నరు. పిడికెడు మందిమి.. పోరాటంలో నిజాయితి ఉంది కాబట్టి.. దమ్ము ఉంది కాబట్టి.. ధైర్యం ఉంది కాబట్టి.. పోతు పోతు తెలంగాణ ఒక ఉప్పెనలా, సముద్రంలా తయారైతే విధి లేక ఇచ్చారు.. అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది