KCR : ఉచ్చు బిగిస్తున్నా కూడా కేసీఆర్ ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉన్నారు…!
KCR : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారడం మనం చూశాం. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేలా తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతుంది. కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తామని అంటున్నా కూడా ఆయన ఏమి భయపడడం లేదు. మరోవైపు ఉద్యమాన్ని కొన్నేళ్ళ పాటు నడిపి చివరికి విజయాన్ని ముద్దాడి తెలంగాణాను సాధించిన ఘనత కేసీఆర్ ఈ మధ్య చాలా సైలెంట్ అయిపోయారు. కేసీఆర్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అంతే కాదు ఫార్మ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆయన ఏడాది కాలంలో ఒకే ఒకసారి అసెంబ్లీకి వచ్చారు. ఇక ఆయన జనంలోకి తొందరలో వస్తారు అని ఒక వైపు వార్తలు వస్తూంటే ఆయన రెస్ట్ తీసుకోవడానికి అమెరికా వెళ్తారు అని రెండు నెలల పాటు అక్కడే ఉంటారు అని కూడా అంటున్నారు…
మౌనం వెనక కారణం..
మాములు సమయంలో వేరే విషయం కాని కుమారుడు కేటీఆర్ మీద కేసులు పడ్డా కూడా నోరు మెదపడం లేదు. ఒక వైపు ఏసీబీ కేసు ఫైల్ చేస్తే మరో వైపు ఈడీ కేసు ఫైల్ చేసింది. ఈ రెండు కేసులతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అని అంటున్నారు. ఈడీ కేసు అంటే కవితను గతంలో అరెస్ట్ చేసి తీహార్ జైలులో నెలల పాటు ఉంచారు. మరి అలాంటి పరిస్థితి ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ అధినేతగా, దానికి మించి తండ్రిగా కేసీఆర్ అయితే ఎక్కడా రియాక్ట్ కాలేదు. కేసులు నమోదు అయి రెండు మూడు రోజులు అయింది. కేసీఆర్ నుంచి స్టేట్ మెంట్ ఒక చిన్నది కూడా లేదు.
కేసీఆర్ మౌనం ఎపుడూ తుఫాను ముందు నిశ్శబ్ద వాతావరణం అని అంతా అంటారు. ఆయన కనుక మౌన ముద్ర దాలిస్తే ఏదో యాక్షన్ ప్లాన్ దాని వెనక ఉంటుందని కొందరి టాక్‌గా తెలుస్తుంది. గతంలో తన కుమార్తెని అరెస్ట్ చేసినపుడు కేసీఆర్ ఏ నాడు మీడియా ముందుకు రాలేదు, తెర వెనకే ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన ఏ రకంగా ఆలోచించారో ఏ విధంగా ప్రయత్నాలు చేశారో ఎవరికీ తెలియదు. ఇపుడు చూస్తే మళ్లీ కుమారుడి వంతు వచ్చింది. ఈ విషయంలో కేసీఅర్ ఏమి చేయబోతున్నారు అన్నదే అంతటా డిస్కషన్ గా ఉంది. అయితే తన కుమారుడి మీద కేసులు పడడంతో కేసీఆర్ కలత చెందుతున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఏసీబీ కేసుల విషయంలో పెద్ద ఫికర్ లేకపోయినా ఈడీ ఎంట్రీయే ఇపుడు బీఆర్ఎస్ ని కలవరపెడుతోంది అని అంటున్నారు. ఏసీబీ కేసు అయితే అరెస్ట్ అయినా రాజకీయంగా మైలేజ్ రావచ్చు సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు టాక్.