Good News : సరికొత్త స్కీమ్ తీసుకొచ్చిన కేంద్రం.. 4 శాతం వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్
ప్రధానాంశాలు:
Good News : సరికొత్త స్కీమ్ తీసుకొచ్చిన కేంద్రం.. 4 శాతం వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్
Good News : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలు తీసుకొస్తూ ప్రజలని సంతోష పరుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. సామాజిక, ఆర్థిక భద్రతా పథకాలు అందిస్తోంది. అందులో ఒకటే కిసాన్ క్రెడిటా క్రార్డ్ స్కీమ్. ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారెంటీ చూపకుండానే రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. వడ్డీ కేవలం 4 శాతమే. అయితే, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులకు మాత్రమే ఇస్తారు. వ్యవసాయంలోని వివిధ దశల్లో రైతుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. తనఖా అవసరం లేకుండా ఈ లోన్ లభిస్తుంది. ఎలాంటి ఆస్తి పత్రాలూ ఇవ్వాల్సిన పని లేదు. బ్యాంక్ నుంచి ఈ రుణాన్ని డైరెక్టుగా అకౌంట్‌లో పొందవచ్చు.
Good News ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి..
రైతులకు మాత్రమే ఈ రుణం ఇస్తారు. అందువల్ల రైతులు బ్యాంకుకి వెళ్లినప్పుడు.. తాము రైతులం అని నిరూపించేందుకు.. వ్యవసాయ పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, ఇతర అవసరమైన పత్రాలను తప్పక తీసుకెళ్లాలి. ఆధార్, అడ్రెస్ ప్రూఫ్ వంటివి కూడా చూపించాల్సి ఉంటుంది. సింగిల్ విండో విధానం ద్వారా అవసరమైన సమయానికి రైతులకు నగదు సాయం అందించేందుకు ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. పార్లమెంట్ వేదికగా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకంలో చేరాల్సిన రైతులకు కావాల్సిన డాక్యుమెంట్లు, వడ్డీ రేట్లు, ఛార్జీల వంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రూ.3 లక్షల వరకు లోన్ తీసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
ప్రాసెసింగ్, డాక్యుమెంటే,న్, విచారణ సహా ఇతర ఛార్జీలను పూర్తిగా మాఫీ చేయాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. చిన్న, సన్నకారు రైతులపై అదనపు భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రూ.3 లక్షలకుపైగా లోన్ తీసుకుంటే పైన చెప్పిన ఛార్జీలన్నీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. బ్యాంక్ వెబ్‌సైట్‌లోని ఎంపికల జాబితా నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోండి. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి అప్లికేషన్ అనే బటన్‌ను క్లిక్ చేయండి. వివరాలకి సంబంధించిన ఫారమ్‌ను పూరించి సబ్మిట్‌ని క్లిక్ చేయండి. సమర్పించిన తర్వాత మీకు రిఫరెన్స్ నంబర్ ఇవ్వబడుతుంది. మీరు రుణం పొందేందుకు అర్హత కలిగి ఉంటే తర్వాతి 3-4 పని దినాల్లో బ్యాంక్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.