KTR : రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చిన కేటీఆర్.. షాక్ లో సీఎం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చిన కేటీఆర్.. షాక్ లో సీఎం..!!

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  KTR : రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చిన కేటీఆర్.. షాక్ లో సీఎం..!!

KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాంలో కులగణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. సమగ్ర కుల గణన సామాజిక ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి విపక్షాల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం బలవంతం అవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కులగణన చేసేందుకు న్యాయవిచారణ కమిషన్ వేయాలని బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని ఆయన కోరారు. కులగణన కోసం బిల్లు తెస్తే బీఆర్ఎస్ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు రోజుల్లో బిల్లును ఆమోదించుకుందామని ఆయన తెలిపారు.

కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పెట్టాలని గతంలో కేసీఆర్ డిమాండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నుంచి ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖపై రెండుసార్లు తీర్మానాలు చేసి పంపినట్లు తెలిపారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పెట్టాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. కేంద్రంలో ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రెండు లక్షల కోట్లు అయినా వస్తాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీసీ కుల గణనకు తీర్మానం కాకుండా బిల్లు ద్వారా చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందని తెలిపారు. కులగణన పై న్యాయ విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కులగణన కోసం బిల్లు చేస్తే మా పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

కులగణనపై తీర్మానం కాదు చట్టం చేయాలని మాజీమంత్రి గంగుల కమలాకర్ కూడా డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేస్తే బీసీ కులాలే నష్టపోతాయని న్యాయపరమైన చిక్కులు రాకుండా చట్టం చేయాలని అసెంబ్లీలో తెలిపారు. కులగణనను ఏ శాఖతో నిర్వహిస్తారు, ఏ విధంగా చేస్తారో ముందే స్పష్టం చేయాలని కులగణన విధివిధానాలపై అఖిలపక్షంతో చర్చించాలని తెలిపారు. కేంద్ర పరిధిలోని అంశంపై రాష్ట్రం ఎలా చట్టం చేస్తుందో తెలపాలని రిజర్వేషన్ 50% మించిపోతాయి ఏం చేస్తారో స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో చేసిన కులగణనకు న్యాయపరంగా చిక్కులు వచ్చాయని మన వద్ద అటువంటి చిక్కులు రాకుండా చట్టం చేయాలన్నారు. జనాభా ఆధారంగా చట్టసభల్లో 50 శాతం బీసీ ఎమ్మెల్యేలు ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది