Lakhpathi Didi Yojana Scheme : మహిళలకు గుడ్ న్యూస్… వడ్డీ లేకుండా 5లక్షల రుణం.. అర్హులు వీళ్లే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lakhpathi Didi Yojana Scheme : మహిళలకు గుడ్ న్యూస్… వడ్డీ లేకుండా 5లక్షల రుణం.. అర్హులు వీళ్లే…

Lakhpathi Didi Yojana Scheme : మహిళల కోసం మోదీ ప్రభుత్వం కొత్త కొత్త స్కీములతో ముందుకొస్తుంది. ఇప్పుడు లక్ష పతి దీని యోజన పథకం కింద మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోంది. రుణపరిమితి రూ లక్ష నుండి 5 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందివ్వడం జరుగుతుంది. అయితే స్వయం సహాయక బృందం ఎస్ హెచ్ జి లో సభ్యులుగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Lakhpathi Didi Yojana Scheme : మహిళలకు గుడ్ న్యూస్... వడ్డీ లేకుండా 5లక్షల రుణం.. అర్హులు వీళ్లే...

  •  Lakhpathi Didi Yojana Scheme : మహిళల కోసం మోదీ ప్రభుత్వం కొత్త కొత్త స్కీములతో ముందుకొస్తుంది. ఇప్పుడు లక్ష పతి దీని యోజన పథకం కింద మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  •  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023లో ఢిల్లీలో స్త్రీల కోసం లక్ష పతి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టాడు

Lakhpathi Didi Yojana Scheme : మహిళల కోసం మోదీ ప్రభుత్వం కొత్త కొత్త స్కీములతో ముందుకొస్తుంది. ఇప్పుడు లక్ష పతి దీని యోజన పథకం కింద మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోంది. రుణపరిమితి రూ లక్ష నుండి 5 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందివ్వడం జరుగుతుంది. అయితే స్వయం సహాయక బృందం ఎస్ హెచ్ జి లో సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే ఈ రుణం మంజూరు చేస్తారని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది. మహిళల అభ్యున్నతి సాధిస్తే ఆ కుటుంబం అలాగే సమాజం కూడా ప్రగతి పథకంలో నడుస్తుంది. కావున శ్రీ సంక్షేమానికి వారి ఆర్థిక ఉన్నతకి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వాటి ద్వారా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రోత్సహిస్తున్నారు.

వివిధ శిక్షణ కార్యక్రమాలతో వారికి ఉపాధి కల్పిస్తున్నారు. అన్ని విధాల అండగా నిలుస్తోంది. ఇదే నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023లో ఢిల్లీలో స్త్రీల కోసం లక్ష పతి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీని ద్వారా స్త్రీలు లక్షాధికారులు చేయాలని ఆయన ముఖ్య లక్ష్యం. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ కల్పిస్తారు. తమ కాళ్లపై నిలబడేలా ఆర్థిక అక్షరాస్త్య ఆర్థిక సాయం అందజేస్తోంది. తద్వారా వారి ఆదాయం వనరులను కల్పించుకోవడానికి పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తోంది. ఈ లక్ష పతి యోజన పథకం అంటే ఏమిటి దానిలో ప్రయోజనాలు ఏమిటి అర్హతలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉపాధి కల్పన లక్ష పతిది యోజన పథకాన్ని ప్రభుత్వ గ్రామీణ మంత్రిత్వ శాఖ అమలు చేయడం జరిగింది. స్త్రీలకు వ్యాపార శిక్షణ అందించడం వస్తువులను మార్కెట్ కి తరలించడం అవసరమైన శిక్షణ కల్పిస్తారు..https://lakhpathididi.gov.inl వెబ్సైట్లోకి వెళ్లి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు..

కోళ్ల ఫామింగ్, ఎల్ఈడి బల్బులు తయారీ పుట్టగొడుగుల పెంపకం ,స్ట్రాబెరీ సాగు, పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, వ్యవసాయం, హస్తకళ వస్తువుల తయారీ తదితర వాటికోసం రుణాలు మంజూరు చేస్తారు. తర్వాత దానికి సంబంధించిన వ్యాపారం మొదలు పెట్టేందుకు నగదును రుణం రూపంలో మంజూరు చేస్తారు. దీనికి వడ్డీ కూడా ఏమీ ఉండదు.స్వయం సహాయ సంఘాల మహిళల కోసం: గ్రామీణ ప్రాంతాలలో నివసించే స్త్రీలకు చిన్నచిన్న సమూహాలుగా ఏర్పడి నెలకి కొంత ఆదాయం పొదుపు చేస్తారు. వాటితో ఒకరు ఒకరికొకరు రుణాలు ఇచ్చుకుంటారు. వీటినే స్వయం సహాయక బృందాలు అంటారు 2023 డిసెంబర్లో విడుదలైన దినదయాళ్ అత్యోదయ యోజన_ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వివరాల ప్రకారం దేశంలో సుమారు 100 మిలియన్ల మంది స్త్రీల సభ్యతులతో 90 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.
ఎక్కువమందికి లబ్ధి కలిగేలా: గత ఏడాది పథకం కింద సుమారు రెండు కోట్ల మంది స్త్రీలకు లబ్ధి చేకూరాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో ఆ సంఖ్యను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది