AI video : మహా కుంభమేళాలో ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్తలు అందరు స్టాల్స్ పెడితే ఎలా ఉంటుంది..!
ప్రధానాంశాలు:
AI video : మహా కుంభమేళాలో ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్తలు అందరు స్టాల్స్ పెడితే ఎలా ఉంటుంది..!
AI video : కొందరికి కొన్ని ఊహాలు ఉంటాయి. ఒకప్పుడు అంటే వాటిని కళ్లారా చూసే అవకాశం ఉండేది కాదు. కాని ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో బ్రతికి ఉన్న మనుషులని కూడా తిరిగి కళ్ల ముందుకు తెస్తున్నారు. ఇటీవల చనిపోయిన దిగ్గజాలు అందరు కుంభమేళాలో పాల్గొంటే ఎలా ఉంటుందనే ఊహాతో ఒక వీడియో రూపొందించగా, ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇక అలానే అదానీ, అంబానీ, ఎలాన్ మస్క్, సుందర్ పిచ్చై.. ఇలా ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు, టెకీలు కుంభమేళాలో స్టాల్స్ పెడితే ఎలా ఉంటుంది..? ఈ ఊహానే చాలా విచిత్రంగా ఉంది.

AI video : మహా కుంభమేళాలో ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్తలు అందరు స్టాల్స్ పెడితే ఎలా ఉంటుంది..!
AI video వీడియో భలే బాగుందిగా..
అయితే ఈ ఊహాని నిజం చేస్తూ ఓ ఏఐ వీడియోని రూపొందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ జనరేటెడ్ వీడియో ఇప్పుడు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దిగ్గజ వ్యాపార వేత్తలు కుంభమేళాలో స్టాల్స్ పెట్టి భలే ఆశ్చర్యపరిచారుగా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించే మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి కొన్ని కోట్ల మంది ప్రజలు హాజరయ్యారు. యూపీ ప్రభుత్వం కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది.
మహాకుంభమేళా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తరచుగా పరిశీలించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. దీనిని భారత దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆధునికతకు, స్వచ్ఛతకు, భద్రతకు అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఇది కేవలం ఓ మతానికి సంబంధించిన కార్యక్రమం కాదు. సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక అని ఆయన ఉద్ఘాటించారు.
ఆదానీ, అంబానీ, ఎలాన్ మస్క్, సుందర్ పిచ్చై.. ఇలా ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు, టెకీలు కుంభమేళాలో స్టాల్స్ పెడితే ఎలా ఉంటుంది..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న AI జనరేటెడ్ వీడియో pic.twitter.com/UCpT6BuMRS
— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2025