Monalisa Bhosle : మోనాలిసానా మజాకా.. గెటప్ మార్చి అప్పుడే సెలబ్రిటీగా మారిందిగా.. వీడియో వైరల్ !
ప్రధానాంశాలు:
Monalisa Bhosle : మోనాలిసానా మజాకా.. గెటప్ మార్చి అప్పుడే సెలబ్రిటీగా మారిందిగా.. వీడియో వైరల్ !
Monalisa Bhosle : అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి ఆ అదృష్టం మన తలుపు తడితే .. ఎంత దరిద్రమైన కూడా అదృష్టంగా మారుతుంది. అయితే మొన్నటివరకు ఇళ్లిళ్లూ తిరుగుతూ పూసలు అమ్ముకున్న మోనాలిసా Monalisa Bhosle .. మహాకుంభమేళా maha kumbh mela పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఉత్తర ప్రదేశ్ uttar pradesh లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాడలో తన అందమైన కళ్లు, చక్కని చిరునవ్వు అట్రాక్ట్ చేసింది. ఒకే ఒక్క వీడియోతో దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసింది.

Monalisa Bhosle : మోనాలిసానా మజాకా.. గెటప్ మార్చి అప్పుడే సెలబ్రిటీగా మారిందిగా.. వీడియో వైరల్ !
Monalisa Bhosle అదృష్టం అంటే ఇదే..
కానీ సోషల్ మీడియా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆమె వీడియో తెగ వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. మోస్ట్ ఫేవరేట్ ఇండియన్ సెలబ్రిటి జాబితాలో చేరిపోయింది. తనకి దక్కిన క్రేజ్ తో ఒక బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తోన్న ‘ది డైరీస్ ఆఫ్ మణిపూర్’ లో మోనాలిసా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇందుకోసం ఆమెను అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే మోనాలిసా రేంజ్, క్రేజ్ పూర్తిగా మారిపోయింది.
తాజాగా ఆమె ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ వెళ్లింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్ లో కేరళకు ప్రయాణించింది. ఈ సందర్భంగా సనోజ్ మిశ్రా స్వయంగా ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా ఎస్కలేటర్‌పై వెళ్లడంలో మోనాలిసా కాస్త ఇబ్బంది పడిగా డైరెక్టర్ సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. బాబీ చెమ్మనూరు కేరళలో మరో బంగారు ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడిదే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది మోనాలిసా.
మోనాలిసా క్రేజ్ మామూలుగా లేదుగా!
మహాకుంభమేళాలో వైరలయిన మోనాలిసా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కేరళలో ఆమె జువెల్లరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేడుకకు హాజరయ్యారు. ఆమె రాక గురించి తెలియడంతో యువకులు మాల్ వద్దకు చేరుకున్నారు. తన లుక్ మార్చేసిన ఈ తేనె కళ్ళ చిన్నది.. అభిమానులకు అభివాదం… pic.twitter.com/nIZ4ySr9jI
— ChotaNews App (@ChotaNewsApp) February 15, 2025