Telangana Budget 2024 : ఈరోజు నుంచి వాళ్లకు రైతు బంధు కట్.. కౌలు రైతులకు రైతు బంధు ఎప్పటి నుంచి ఇస్తాం అంటే..!
Telangana Budget 2024 : ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది కాంగ్రెస్ కు తొలి బడ్జెట్ కావడం విశేషం. ఆరు గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠత పెరిగింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనసభలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి విక్రమార్క రైతు భరోసాపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. రైతుబంధు నిబంధనలో పునః సమీక్ష […]
ప్రధానాంశాలు:
Telangana Budget 2024 : ఈరోజు నుంచి వాళ్లకు రైతు బంధు కట్.. కౌలు రైతులకు రైతు బంధు ఎప్పటి నుంచి ఇస్తాం అంటే..!
Telangana Budget 2024 : ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది కాంగ్రెస్ కు తొలి బడ్జెట్ కావడం విశేషం. ఆరు గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠత పెరిగింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనసభలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి విక్రమార్క రైతు భరోసాపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. రైతుబంధు నిబంధనలో పునః సమీక్ష చేసి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు 15,000 అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని అన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని తెలిపారు.
రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. రైతుల రుణమాఫీ పై కూడా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రైతు రుణమాఫీ పై కూడా మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ పై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విధివిధానాలను రూపొందిస్తున్నామని, ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామని అన్నారు.
అర్హులకే రైతు బంధు ఇస్తామని రైతు బంధు నిబంధనలు పునః సమీక్షిస్తాం అన్నారు. ఎకరాకు 15,000 కౌలు రైతులకు కూడా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రైతుబంధుతో పెట్టుబడిదారులు అనర్హులు లాభపడ్డారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతుబంధు వచ్చింది. ఇప్పుడు వారికి రైతుబంధు కట్ అవుతుందని అన్నారు .నాసిరకం విత్తనాలను నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని కూడా తమ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాలలో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు తీసుకుంటామని ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.