Big Breaking : బిగ్ బ్రేకింగ్.. జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Big Breaking : బిగ్ బ్రేకింగ్.. జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ..?

Big Breaking : టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గురించి రెండు విషయాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఒకటి భోళా శంకర్ సినిమా కాగా.. మరొకటి ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నారనే వార్తలు రావడం. నిజానికి మెగాస్టార్ రాజకీయాలు మానేసి చాలా ఏళ్లు అవుతోంది. ఆయన రాజకీయాలను వదిలేయడమే కాదు.. అసలు తన పార్టీని కూడా కాంగ్రెస్ లో కలిపేసి ఇక దాని జోలికి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :17 August 2023,9:00 am

Big Breaking : టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గురించి రెండు విషయాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఒకటి భోళా శంకర్ సినిమా కాగా.. మరొకటి ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నారనే వార్తలు రావడం. నిజానికి మెగాస్టార్ రాజకీయాలు మానేసి చాలా ఏళ్లు అవుతోంది. ఆయన రాజకీయాలను వదిలేయడమే కాదు.. అసలు తన పార్టీని కూడా కాంగ్రెస్ లో కలిపేసి ఇక దాని జోలికి వెళ్లలేదు. అయితే.. ఇక్కడ మన చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. తన సొంత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఏపీలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

megastar chiranjeevi to join in janasena party

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చతికిలపడ్డారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నారు. కానీ.. 2024 ఎన్నికల్లో మాత్రం గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ.. వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

Big Breaking : వాల్తేరు వీరయ్య ఈవెంట్ లో చిరంజీవి వ్యాఖ్యలు చేయడానికి కారణం అదేనా?

కట్ చేస్తే.. వాల్తేరు వీరయ్య 200వ రోజు ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని చిరంజీవి హింట్ ఇచ్చారా అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఏపీలో వైసీపీని ఓడించాలంటే తన బలం ఒక్కటే సరిపోదని.. అందుకే వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు పవన్. కానీ.. ఇంట్లోనే పవర్ ఫుల్ వ్యక్తి ఉండగా వేరే వాళ్లను బతిమిలాడటం ఎందుకని.. తన సొంత అన్న మెగాస్టార్ చిరంజీవి జనసేనలోకి వస్తే ఇక జనసేన బలం రెట్టింపు అవుతుందని పవన్ భావిస్తున్నారట. అందుకే.. చిరంజీవిని జనసేనలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అందుకే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నట్టు హింట్ ఇచ్చారా? అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది