Modi : వ‌చ్చే వారంలో ఏపీకి ప్ర‌ధాని మోదీ.. రూ.80 వేల కోట్ల పెట్టుబ‌డులు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Modi : వ‌చ్చే వారంలో ఏపీకి ప్ర‌ధాని మోదీ.. రూ.80 వేల కోట్ల పెట్టుబ‌డులు ?

Modi : ముఖ్యమంత్రి చంద్రబాబు Chandrababu , ప్ర‌ధాని మోదీ Pm Modi మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డ‌డం మ‌నం చూశాం. శుక్రవారం మధ్నహ్నం చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టుల అంశం పైన ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతికి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ 15 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 November 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Modi : వ‌చ్చే వారంలో ఏపీకి ప్ర‌ధాని మోదీ.. రూ.80 వేల కోట్ల పెట్టుబ‌డులు ?

Modi : ముఖ్యమంత్రి చంద్రబాబు Chandrababu , ప్ర‌ధాని మోదీ Pm Modi మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డ‌డం మ‌నం చూశాం. శుక్రవారం మధ్నహ్నం చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టుల అంశం పైన ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతికి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ 15 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం కేంద్ర గ్రాంటుగా ఇస్తుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. 30 ఏళ్ల కాల పరిమితి తో రుణం ఖరారైంది. ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు.

Modi మోదీ వ‌రాల వెల్లువ‌..

నవంబర్‌ 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న ప్రధానమంత్రి మోదీ విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పార్క్‌ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌కు 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగబోతోందని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌తో పాటు గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టుల కారణంగా వచ్చే నాలుగేళ్లలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Modi వ‌చ్చే వారంలో ఏపీకి ప్ర‌ధాని మోదీ రూ80 వేల కోట్ల పెట్టుబ‌డులు

Modi : వ‌చ్చే వారంలో ఏపీకి ప్ర‌ధాని మోదీ.. రూ.80 వేల కోట్ల పెట్టుబ‌డులు ?

విశాఖలోని పూడిమడకలో ఎన్టీపీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. 84,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్లు వస్తాయని… విండ్, సోలార్‌ హైబ్రిడ్‌ పంప్డ్‌ స్టోరేజీకి కావాల్సిన 20 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టులో ఏపీ జెన్‌కోకు 50 శాతం భాగస్వామ్యం ఉంది. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం గురించి కూడా చంద్రబాబు వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి రానున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖ రైల్వే జోన్‌ శంకుస్థాపన కూడా మోదీ చేతుల మీదుగా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది