Nara Lokesh : మా అమ్మను కూడా జైలులో వేస్తాం అన్నారు.. ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేసిన నారా లోకేష్
Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే చంద్రబాబు అరెస్ట్ గురించి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఓవైపు టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడిన నారా లోకేష్.. టీడీపీ పార్టీకి సంక్షోభాలు కొత్తేమీ కాదన్నారు. మంగళగిరి […]
Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే చంద్రబాబు అరెస్ట్ గురించి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఓవైపు టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడిన నారా లోకేష్.. టీడీపీ పార్టీకి సంక్షోభాలు కొత్తేమీ కాదన్నారు. మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ కంట తడి పెట్టుకున్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని.. ప్రజల కోసమే ఆయన పాటుపడ్డారని స్పష్టం చేశారు.
తన తల్లి ఐటీ రిటర్న్స్ చూపించి ఆమెపై కూడా కేసు పెడతామని సీఐడీ అధికారులు బెదిరించారని నారా లోకేష్ తెలిపారు. నా తల్లి ఏనాడైనా బయటికి వచ్చారా? సేవా కార్యక్రమాలు తప్ప తన తల్లికి ఎలాంటి రాజకీయాలు తెలియదు. నా తల్లి, భార్య కలిసి భోజనంలో విషం కలుపుతారంటూ వైసీపీ మంత్రులు అంటున్నారు. అలాంటి పనులు వైసీపీ నేతలు చేస్తారు. బాబాయిని లేపేది ఎవ్వరో అందరికీ తెలుసు అని నారా లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి 160 సీట్లు గెలువబోతోందని నారా లోకేష్ జోస్యం చెప్పారు. నవంబర్ 1 నుంచి చంద్రబాబు భరోసా ఇచ్చిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రారంభం అవుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు.
Nara Lokesh : త్వరలోనే యువగళం పాదయాత్ర ప్రారంభం
నా కలలో కూడా టీడీపీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదు. శాంతియుతంగా పోరాడి ఈ అరాచక పాలనను అంతమొందించాలని నారా లోకేష్ అన్నారు. ఒకప్పటి పోరాటం వేరు.. ఇప్పటి పోరాటం వేరు. ఇప్పుడు జగన్ అనే రాక్షసుడితో పోరాడుతున్నాం.. అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు.