Nara Lokesh : విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన నారా లోకేష్.. !
Nara Lokesh : గత కొద్ది రోజులుగా ఏపీలో Nara Lokesh అనేక మార్పులు చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా విద్యార్ధులకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.పాఠశాల స్థాయి లో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బరువు తగ్గించి, నాణ్యత పెరిగేలా నూతన పాఠ్య ప్రణాళిక రూ పొందించాలని ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖలపై మంగళవారం సమీక్ష నిర్వహించా రు. ‘ఏపీ మోడల్ ఎడ్యుకేషన్’ లక్ష్యంగా సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాల విద్యలో ఓఎంఆర్ షీట్ ల స్థానంలో డిజిటల్ అసె్‌సమెంట్ చేస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని చెప్పారు…
Nara Lokesh : కొత్త ప్రణాళిక..
2025-26 విద్యాసంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళిక సమూల ప్రక్షాళనపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి లోకేశ్ ఉండవల్లి నివాసంలో 4 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేపట్టాలని అన్నారు. స్కూలు ఎడ్యుకేషన్ లో జీవో నెం. 117కు ప్రత్యామ్నాయం విషయంలో ఎమ్మెల్యేలు, స్కూలు మేనేజ్ మెంట్ కమిటీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్లేస్కూలు పాలసీపై కూడా సమావేశంలో చర్చసాగింది. ప్రస్తుతం విద్యార్థులకు రెండు సెమిస్టర్లకు వేర్వేరుగా పుస్తకాలు ఇస్తున్నారు. ఇకపై ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా పుస్తకం అక్కర్లేకుండా, కొన్ని సబ్జెక్టుల ను కలిపి ఒకే పుస్తకంగా తీసుకొచ్చే విధానాన్ని అధికారులు వివరించారు.
పాఠ్యాంశాల్లో నైతికవిలువల అంశాలను ప్రవేశపెట్టడంతోపాటు సెమిస్టర్ వైజ్ గా వేర్వేరు టెక్స్ట్ బుక్స్ కాకుండా ఒకే పుస్తకాలు రెండుసెమిస్టర్ల పాఠ్యాంశాలు ఉండేలా రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనివల్ల పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించవచ్చని సూచించారు. పైతరగతుల్లో ప్రస్తుతం ఉన్న పుస్తకాలను సగానికి తగ్గించి, రెండు, మూడు సబ్జెక్టులు ఒకే పుస్తకంలోకి తేవాలనే ప్రతిపాదనలు చేశారు. దీనిని మరోసారి పరిశీలించి, నిర్ణయించాలని మంత్రి ఆదేశించారు. విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా డీఎస్సీ పూర్తిచేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్ విద్యలో గత పదేళ్లుగా ఎలాంటి సంస్కరణలు తీసుకురాలేదన్నారు.