Nara Lokesh : కోడికత్తి జగన్ ఈక కూడా పీకలేడు.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : కోడికత్తి జగన్ ఈక కూడా పీకలేడు.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

 Authored By brahma | The Telugu News | Updated on :11 March 2021,11:41 am

Nara Lokesh : నిన్నటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒక పోలీస్ అధికారికి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. తదనంతర పరిస్థితుల్లో రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. ఈ అరెస్ట్ ను రాష్టంలోని టీడీపీ నేతలందరూ ఖండిస్తూ, సీఎం జగన్ మీద విమర్శల జడివాన కురిపించారు.

nara lokesh

ఎమ్మెల్సీ నారా లోకేష్ మాట్లాడుతూ.. సౌమ్యుడు, వివాద రహితుడైన కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. మంచి సీఎం రాష్ట్ర అభివృద్ధితో ఆనందాన్ని పొందుతాడు. మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి రాక్షస ఆనందం పొందుతాడు. కోడికత్తి జగన్ రెడ్డి, తాపీకత్తి నాని కలిసి కొల్లు రవీంద్ర ఈక కూడా పీకలేరు. మీరు ఎంత అణిచినా ఉప్పెనలా టిడిపి సైన్యం మీపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అధికార మదంతో వైకాపా నేతలు చెప్పినట్టు ఆడుతున్న కొంతమంది అధికారులు జగన్ రెడ్డితో కలిసి చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి.

మరోపక్క అచ్చెన్నాయుడు మాట్లాడుతూ “రాష్ట్రంలో బీసీలపై కక్ష సాధింపులు ఏవిధంగా ఉన్నాయో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు ద్వారా మరోసారి నిరూపితమైంది. రవీంద్ర అరెస్టును ఖండిస్తున్నాం. శివరాత్రి నాడు కూడా టీడీపీ నేతలను అరెస్టులతో వెంటాడుతున్నారు. తన కుటుంబంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్న జగన్ రెడ్డి మరో వైపు టీడీపీ నేతల్ని అరెస్టులు చేయించి రాక్షసానందం పొందుతున్నారు.

kollu ravindra arrest

ప్రజాస్వామ్యాన్ని కూడా లెక్కచేయలని క్రూర స్వభావం జగన్ రెడ్డిది. అధికారంలోకి వచ్చిన నాటి నుండే బీసీలపై జగన్ రెడ్డి కన్నెర్ర చేశారు. వైసీపీ అక్రమాలను అడ్డుకున్నందుకే కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిన్నటి ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎన్నో దురాగతాలకు పాల్పడ్డారు. పోలీసులు వారిపై ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ చట్టాలు వైసీపీ నేతలకు చుట్టాలు అయ్యాయా? జగన్ తన నిరంకుశ పాలనతో బడుగు, బలహీన వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీల అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. జగన్ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారంటూ అచ్చెన్నాయుడు విమర్శించాడు.

కొల్లు రవీంద్ర అరెస్ట్ ను నిరసిస్తూ ఎక్కడిక్కడ టీడీపీ నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని,మాజీ మంత్రి సోమిరెడ్డి ,మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మొదలైన నేతలు రవీంద్ర అరెస్ట్ అక్రమమని, వెంటనే ఆయన్ని విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు .

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది