Pawan kalyan : ఆస్తులను పంచుతూ హద్దులు దాటితే ఎలా పవన్…? బూతులు తిడితేనే గెలుస్తారా…?
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో 5 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ నాయకులు జోరు పెంచి ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రతో ప్రచారాలు చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారాలలో పవన్ కళ్యాణ్ హద్దులు దాటుతున్నట్లుగా అర్థమవుతుంది. దీంతో కూటమి అధికారంలోకి వచ్చినట్లే అనే భ్రమలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అయితే గత […]
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో 5 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ నాయకులు జోరు పెంచి ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రతో ప్రచారాలు చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారాలలో పవన్ కళ్యాణ్ హద్దులు దాటుతున్నట్లుగా అర్థమవుతుంది. దీంతో కూటమి అధికారంలోకి వచ్చినట్లే అనే భ్రమలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అయితే గత రాత్రి ఆయన చంద్రబాబుతో కలిసి తిరుపతి రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. రోడ్ షో ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ సభలో కూడా ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే అలిపిరిలో మందు పాత్రలు దాటికి చంద్రబాబు కారు దాదాపు 16 అడుగుల పైకి ఎగిరి కింద పడిందని అయినా సరే వాటన్నింటినీ తట్టుకుని తిరిగి వచ్చిన దీరుడు అంటూ ,పవన్ కళ్యాణ్ చంద్రబాబును పొగడటమే పనిగా పెట్టుకున్నారు
Pawan kalyan : వైయస్ఆర్ అందుకే గాలిలో కలిశాడు…
ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ప్రసంగిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి కోడి బోచ్చు అమ్ముకుంటూ 20 లక్షలు సంపాదిస్తున్నారని పొంతన లేని విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో భూమన రౌడీయిజానికి భయపడతారా అంటూ ప్రశ్నించారు. అంతేకాక గతంలో వైయస్ఆర్ తిరుపతిలో మాట్లాడుతూ 7కొండలు కాదు 2 కొండలు మాత్రమే ఉన్నాయని అనడం వలనే గాలిలో కలిసిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం నగర వాసులను సైతం ఆశ్చర్యపరిచింది.అంతేకాక గత కొంతకాలంగా తిరుమల దేవస్థానం నిధులను అభివృద్ధి పనులకు ఎలా ఉపయోగిస్తారు అని విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్…ఇటీవల పాల్గొన్న ప్రచారాలలో మాట్లాడుతూ తిరుపతిలో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెడతామంటూ చెప్పుకు రావడం ఆశ్చర్యం. ఇక ఎన్నికల్లో ఓటర్లకు వైసీపీ పార్టీ ఇచ్చే 2000 కూడా టీడీపీ సొమ్మని దానిని భద్రంగా తీసుకువెళ్లి తిరుమల హుండీలో వేయాల్సిందిగా పవన్ పిలుపునిచ్చారు.
ఈ విధంగా అర్థం పర్ధం లేకుండా నోటికి వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని తిరుపతిలోనే కాదు ప్రతిచోట ఇదే జరుగుతుందంటూ పలువు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇవన్నీ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కూటమి మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా దాటేస్తున్నారని ,వాటన్నిటిని చంద్రబాబు చూసుకుంటారు అన్నట్లు పవన్ కేవలం ప్రత్యర్థులను తిట్టడం పైనే ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. ఇక ఈ బహిరంగ సభల్లో తొక్కి నార తీస్తా అనడం , జైలుకు పంపిస్తామని హెచ్చరించటం కేవలం పవన్ కళ్యాణ్ కి చెల్లింది. దీంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన ప్రయోజనం ఏంటి అంటూ పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కు ఇది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.