Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని కలిసిన దిల్ రాజు.. చరిత్ర సృష్టించేలా గేమ్ చేంజర్ ఈవెంట్..!
Pawan Kalyan : దిల్ రాజ్ నిర్మాతగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో సూపర్ హిట్ కాగా త్వరలో మన దగ్గర కూడా ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
Pawan Kalyan స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్..
ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. గేమ్ చేంజర్ రిలీజ్ సందర్బంగా విజయవాడ వజ్ర గ్రౌండ్స్ లో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ పెట్టారు. ఈ కటౌట్ లాంచ్ కి వచ్చిన దిల్ రాజు గేమ్ చేంజర్ ఈవెంట్ గురించి హింట్ ఇచ్చారు.
ఇక్కడకి కటౌట్ లాంచ్ తో పాటు డిప్యూటీ CM ని కలిసేందుకు వచ్చానని అన్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్ కి పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు పెడతామని అన్నారు. Pawan Kalyan, Ram Charan, Dil raju , Game Changer Movie,