Pawan Kalyan : అన్నయ్య చేయలేని పనులు తమ్ముడు చేయబోతున్నాడా..?
ప్రధానాంశాలు:
Pawan Kalyan : అన్నయ్య చేయలేని పనులు తమ్ముడు చేయబోతున్నాడా..?
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత గ్రామమైన మొగల్తూరు అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2009లో చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసినప్పుడు, సొంత ఊరుకు ఏం చేయలేదంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మొగల్తూరును అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 27న మొగల్తూరులో పర్యటించనున్న ఆయన, గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను విశ్లేషించి, గ్రామానికి చిరకాల గుర్తింపు వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Pawan Kalyan : అన్నయ్య చేయలేని పనులు తమ్ముడు చేయబోతున్నాడా..?
Pawan Kalyan మొగల్తూరు రూపురేఖలు మార్చబోతున్న పవన్
పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి & పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షిస్తుండటంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రహదారుల విస్తరణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై, గ్రామంలోని ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయించనున్నారు. అదేరోజు సాయంత్రం పెనుగొండలో గ్రామ సభను నిర్వహించనున్న పవన్, ప్రజల సమస్యలు స్వయంగా విని, అభివృద్ధి కోసం తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.
గతంలో ప్రజారాజ్యం పార్టీకి పెద్దగా మద్దతు లభించలేదు. కానీ ఇప్పుడు జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గట్టి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మొగల్తూరును రూల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలపై తక్షణ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఇది పవన్ పాలనలో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. మొగల్తూరులో మొదలుపెట్టే అభివృద్ధి మోడల్‌ను ఇతర నియోజకవర్గాల్లోనూ అమలు చేసేలా పవన్ తగిన చర్యలు తీసుకోవడం విశేషం.