Pawan Kalyan : ఢిల్లీకి పవన్.. కేంద్రంతో తాడో పేడో.. నిధులతోనే రాష్ట్రానికి వస్తాడా..?
Pawan Kalyan : ఒకసారి గెలిపించండి తన పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యేగా గెలవడమే కాదు డిప్యూటీ సీఎం గా పలు కీలక శాఖలకు మంత్రిగా రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, కాలుష్య నియంత్రణ, పంచాయతీరాజ్, శాస్త్రసాంకేతిక శాఖలను సొంతం చేసుకున్నారు. అయితే ఈ శాఖల్లో సరైన నిధుల లేకపోవడంపై పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం బాధపడ్డారు. ముఖ్యంగా ఏపీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం కాజేసిందని పవన్ చెప్పారు.
Pawan Kalyan నిధులతోనే రాష్ట్రానికి పవన్..
ఈ విషయంపై కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు పవన్ దిలీప్ బయలుదేరుతున్నారని తెలుస్తుంది. ఢిల్లీలో ప్రధాని మోదీతో సహా సంబంధిత శాఖల కేంద్ర మంత్రులను మీట్ అయ్యి ఏపీకి కావాల్సిన నిధుల గురించి మాట్లాడతారని తెలుస్తుంది. అంతేకాదు రాష్ట్రానికి సంబందించిన రైల్వే జోన్ తో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొదలైన అంశాలకు సంబందించి కూడా మోడీ దగ్గర పవన్ ప్రస్తావిస్తానని అన్నారు. పవన్ ఈ నెల 19న ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో జరగనున్న జలజీవన్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొన నున్నారు. కేంద్రం సమక్షంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఇదేవిధంగా ఏపీలో పైపులైన్ల ద్వారా గ్రామాలన్నిటికి సురక్షిత తాగు నీరు అందించాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టుకున్నారు. ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం జల జీవన్ మిషన్ కు అసలు కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధులు రాలేదని నిధులు ఆపేసిందని ఆరోపణలు చేసింది. అప్పుడే కేంద్రం ఇచ్చిన ఛాన్స్ వాడుకుని ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, ఇంటికీ శుభ్రమైన తాగునీరు అందించేదని అన్నారు.