Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌స్తిన ప‌ర్య‌ట‌న వెన‌క ఇంతా ఉందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌స్తిన ప‌ర్య‌ట‌న వెన‌క ఇంతా ఉందా..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 November 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌స్తిన ప‌ర్య‌ట‌న వెన‌క ఇంతా ఉందా..!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొన్న‌టి వ‌ర‌కు సినిమాల‌లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు రాజ‌కీయాల‌లోను స‌త్తా చాటుతున్నారు. పవన్ కళ్యాణ్ అకస్మాత్తు హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కేంద్ర పెద్దలను కలవలేదని, మర్యాదపూర్వకంగా కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి ముందు కాసేపు ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి అమిత్ షా నివాసానికి బయలుదేరే ముందు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానమిచ్చారు…

Pawan Kalyan పెద్ద స్కెచ్చే..

సమావేశం ఎజెండా ఏంటన్నది ఆయన చెప్పలేదు. మొత్తమ్మీద సాయంత్రం గం. 6.30 సమయంలో అమిత్ షాతో సమావేశమైన పవన్ కళ్యాణ్, 15 నిమిషాల పాటు చర్చించి నేరుగా విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ భేటీలో ఏం చర్చించారన్నది అటు పవన్ కళ్యాణ్ లేదా ఇటు అమిత్ షాకు తప్ప మరెవరికీ తెలియదు.సహకార శాఖతోపాటు పంచాయతీ రాజ్, అటవీ పర్యావరణ శాఖల నుంచి ఏపీకి నిధుల కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపైనా మాట్లాడినట్లు సమాచారం. అలాగే ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అమిత్ షాతో పవన్ చర్చించారు. సమావేశం అనంతరం ఆయన ఏపీకి బయలుదేరారు.

Pawan Kalyan ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌స్తిన ప‌ర్య‌ట‌న వెన‌క ఇంతా ఉందా

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌స్తిన ప‌ర్య‌ట‌న వెన‌క ఇంతా ఉందా..!

ప‌వ‌న్ హ‌స్తిన ప‌ర్య‌ట‌న వెన‌క మ‌రో కార‌ణం ఉంద‌ని అంటున్నారు.మహారాష్ట్రలో ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ప్రచారానికి ఈ నెల 18 దాకా గడువు ఉంది. కీలక నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు వారు ఉన్న చోట పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారట.మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కి కొత్త ఇమేజ్ ఈ సనాతన వాదంతో ఏర్పడుతుంద‌ని భావిస్తున్నారు. దాంతో పవన్ కూడా బీజేపీ పెద్దల కోరికను మన్నిస్తున్నారు అని అంటున్నారు.తాము నేరుగా విస్తరించలేకపోతున్న రాష్ట్రాల్లో భావసారూప్యత కల్గిన పార్టీల ద్వారా పాగా వేయాలని చూస్తున్న కాషాయ నేతలకు పవన్ కళ్యాణ్ దక్షిణాదిన బలమైన హిందూ నేతగా కనిపించారు. సినీ ప్రపంచంలో తిరుగులేని క్రేజ్ కల్గిన పవన్ కళ్యాణ్, రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకోవడంతో ఆయనను ఒక ఆయుధంగా మలచుకోవాలని చూస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది