YSR : రాజశేఖర్ రెడ్డి తర్వాత జనం ఎక్కువగా నమ్మింది ఆయన్నే.. కానీ నట్టేట ముంచేశాడు
YSR : ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాలనకు వంక పెట్టిన వాళ్లు లేరు. ఆయన పేద ప్రజల ఆప్తుడు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వైఎస్సార్ తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికీ రాష్ట్రం విడిపోయానా రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి అంటే.. అది వైఎస్సార్ గొప్పదనమే. అయితే.. వైఎస్సార్ తర్వాత అంతగా ఏపీ ప్రజలు నమ్మింది మరెవరినో కాదు.. చంద్రబాబునే. అవును.. టీడీపీ అధినేత చంద్రబాబు అత్యధిక కాలం ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీ విడిపోయాక కూడా ఆయనే తొలి ముఖ్యమంత్రి అయ్యారు అంటే.. జనాలు ఆయన్ను ఎంతగా నమ్మారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
చంద్రబాబు ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవ్వరూ ఆయన స్టెప్ ను అంచనా వేయలేరు. అదే ఆయన నైజం. ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. కానీ.. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఆయన నిల్. సంక్షేమ పథకాలను ఆయన పెద్దగా పట్టించుకోరు. అదే 2019 లో ఆయనకు మైనస్ అయింది. నిజానికి 2014 లో చంద్రబాబును జనాలు ఎందుకు గెలిపించారో తెలుసా? కొత్త రాష్ట్రం అవసరం అలాంటిది. అందుకే అనుభవం ఉన్న నాయకుడిని ఏపీ ప్రజలు ఎన్నుకున్నారు. కానీ.. ఏమైంది.. ఆయన సంక్షేమం పక్కన పెట్టేశారు. దీంతో 2019 ఎన్నికల్లో చంద్రబాబును దారుణంగా ఓడించారు ఏపీ ప్రజలు.ఇప్పటికైనా చంద్రబాబు ఇంకా ఎక్కడో పాత కాలంలోనే ఉండిపోయారు. అప్పట్లో అంటే సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా పెద్దగా ఒరిగిందేం లేదు. కానీ.. ఇప్పుడు అలా కాదు కదా. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పారు. రుణమాఫీ గురించి చెప్పారు. మీరు రుణాలు కట్టకండి అన్నారు.
YSR : ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే అంతే?
కానీ.. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రుణమాఫీ ఏమైంది. ఇలా.. పలు సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎన్నికలకు సంవత్సరం ముందే మేనిఫెస్టో ప్రకటించినా.. చంద్రబాబు తన తప్పు తెలుసుకున్నా కూడా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే చంద్రబాబు తెలివిగా.. తన ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్ తో రాజకీయాలు నడిపిస్తున్నారు. చూద్దాం ఈ రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారో?