Ys jagan : జగన్ సంచలన నిర్ణయం..? ఆమెకు కీలక పదవి ఇవ్వబోతున్నాడా..?
Ys jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఒకటి చేయాలి అనుకుంటే ఆరునూరైనా అది చేయటానికి తనకున్న అన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఎలాగోలా ఆ పని చేయాలి అనుకుంటాడు. బయట నుండి ఎన్ని విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గే స్వభావం జగన్ కు లేదని కొందరు అనే మాటలు. అలాంటి సీఎం ఐఏఎస్ అధికారిణి ఎర్ర శ్రీలక్ష్మి విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది.
శ్రీలక్ష్మి కి కీలకమైన సీఎస్ పదవి ఇవ్వటానికి జగన్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ అక్రమాస్తుల కేసులో మొదటిగా జైలుకెళ్లిన అధికారిణి శ్రీలక్ష్మి గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో కమిషనర్ హోదాలో ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో క్విడ్ ప్రొ కో ఆరోపణలపై సీబీఐ విచారణ జరుగుతున్న తెలిసిందే. ఇదే కేసులో శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లారు. తరువాత విడుదలయ్యారు.
రాష్ట్ర విభజన తరువాత శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. గత ఏడాది తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం శ్రీలక్ష్మిని పురపాలక శాఖ కార్యదర్శిగా నియమించారు. తరువాత కొంతకాలానికే శ్రీలక్ష్మికి పదోన్నతి లభించింది. కార్యదర్శి హోదాను ముఖ్య కార్యదర్శి హోదాకు పెంచుతూ గత జనవరి 18న ఉత్వర్తులు జారీ చేశారు. తాజాగా శ్రీలక్ష్మికి తత్కాలిక పదోన్నతి ఇస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ పదోన్నతితో శ్రీలక్ష్మి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా పొందారు. అయితే కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో తీర్పునకు లోబడి ఈ పదోన్నతులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది. సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ తోపాటే సీనియార్టీలో అజయ్ సాహ్ని, రెడ్డి సుబ్రమణ్యం, త్రిపాఠి, సతీష్ చంద్ర, సమీర్ శర్మ, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్‌లు ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రమణ్యంలు కేంద్ర సర్వీసులో ఉండడంతో ఆదిత్యనాథ్ దాస్‌ను సీఎస్‌గా నియమించారు. అయితే ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పూర్తయ్యే సమయానికే ఒకరిద్దరు మినహా వీరిలో చాలామంది పదవీకాలం కూడా పూర్తవుతుంది. అదే సమయంలో శ్రీలక్ష్మి పేరు సీనియార్టీ జాబితాలో, హోదా జాబితాలోనూ ముందంజలో ఉంటుందని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే శ్రీలక్ష్మి సీఎస్ కావచ్చు.