YS Jagan : ఆ జనమేంట్రా బాబు.. జగన్ సభలకు తరలివస్తున్న జనసంద్రం..!
ప్రధానాంశాలు:
YS Jagan : ఆ జనమేంట్రా బాబు.. జగన్ సభలకు తరలివస్తున్న జనసంద్రం..!
YS Jagan : సాధారణంగా పార్టీలు పెట్టే మీటింగ్ లకు జనాలు పెద్దగా రారు అన్నది అందరికీ తెలిసిందే. ఒకవేళ ఎంతో కొంత మంది వచ్చినా వారు కూడా బీరుకో, బిర్యానికో, లేదంటే డబ్బులు ఇస్తేనో వస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ వాటన్నింటినీ కాసేపు పక్కన పెడితే మాత్రం జగన్ సభలను చూస్తుంటే నేషనల్ మీడియా కూడా ఆశ్చర్యపోతోంది. అసలు ఈ జనసందోహం ఎక్కడ మొదలైందంటే రాప్తాడులోని మొదటి సిద్ధం సభ నిర్వహించినప్పుడే. ఆ సభకు వచ్చిన జనాలను చూసి తమిళ మీడియా కూడా షాక్ అయిపోయి మరీ చూపించింది జనాలకు.
YS Jagan : పార్టీ ప్రోగ్రామ్ అయినా..
ఆ సభకు వచ్చిన జనాలను అటు నేషనల్ మీడియా కూడా కవర్ చేసి ఆశ్చర్యపోయింది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడే అంత మంది జనాలను సమీకరించడానికి పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. కానీ రాప్తాడులో నిర్వహించిన సభ ప్రభుత్వ కార్యక్రమం కాదు. కేవలం పార్టీ సభ మాత్రమే. పార్టీల సభలకు ఇంత పెద్ద ఎత్తున జనాలు రావడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం జగన్ కు మాత్రమే సాధ్యం అయిందని చెప్పుకోవాలి. జగన్ జనం ముందుకు రావడానికే భయపడుతున్నాడు అంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా.. వాటిని జనాలు తుత్తునియలు చేసి మరీ వస్తున్నారు.
అసలు జనం కోసం జగనా.. లేదా జగన్ కోసం జనమా అన్నట్టు ఆ జనాలు వస్తున్నారు. ఇక సిద్ధం సభలు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ అవుతున్నాయి. దానికి కొనసాగింపుగా ఇప్పుడు జగన్ రోజులకు నాలుగు సభలను నిర్వహిస్తున్నారు. రోడ్ లు షోలుచేస్తున్నా సరే వాటికి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. సాధారణంగా ఒక పార్టీ కార్యక్రమానికి జనాలు ఇంత పెద్ద ఎత్తున అసలే రారు. కానీ ఇప్పుడు ఇంతగా వస్తున్నారంటే మాత్రం అది కేవలం జగన్ మేనియానే అని చెబుతున్నారు వైసీపీ నేతలు. జగన్ మీద జనాల్లో ఉన్న ఆదరణే ఇలా కనిపిస్తోందని అంటున్నారు. ఈ జనాలు రేపు పొద్దున ఎన్నికల్లో ఓట్ల రూపంలో కురిపిస్తారని చెబుతున్నారు. మరి వైసీపీ ఆలోచిస్తున్నట్టు సభలకు వస్తున్న జనాలు మొత్తం ఓట్ల రూపంలో కురిపిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం పోలింగ్ వరకు ఆగాల్సిందే.