Perni Nani : తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు కాని ఊళ్లో మాత్రం ఉండడు అంటూ పవన్ పై నాని ఫైర్
ప్రధానాంశాలు:
Perni Nani : తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు కాని ఊళ్లో మాత్రం ఉండడు అంటూ పవన్ పై నాని ఫైర్
Perni Nani : ఏపీలోని కూటమి ప్రభుత్వంపై ఛాన్స్ దొరికినప్పుడల్లా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పేర్ని నాని విమర్శలు కురిపించారు. ఏపీలో ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతుంటే మరోవైపు మద్యం ఏరులై పారుతుందని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైన డిస్టలరీలని రద్దు చేసిందా అని ప్రశ్నించారు.

Perni Nani : తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు కాని ఊళ్లో మాత్రం ఉండడు అంటూ పవన్ పై నాని ఫైర్
Perni Nani నాని ఫైర్..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైసీపీకి చెందిన ఆస్తులు ధ్వంసం చేశారు. కేరళ, బెంగళూరు మద్యం ఏపీలో ఎందకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో అన్నట్టే ఉంది ఇప్పుడు ఏపీలో పాలన. సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదు కాని మద్యం మాత్రం యదేచ్ఛగా సరఫరా అవుతుంది.
బెల్ట్ షాపులుంటే తోలు తీస్తానన్న సీఎం.. మద్యం అఖరికి బడ్డీ కోట్టులో దొరుకుతున్నా ఎందుకు మాట్లాడడం లేదు అని విమర్శించారు. వైసీపీ పాలనలో మద్యం పాలసీపై చంద్రబాబు, పవన్ విషం కక్కారు. ఇప్పుడు గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకోవడం లేదు. వైసీపీ కల్తీ మద్యం అమ్ముతుందని విషపు ప్రచారం చేశారు. ఇప్పుడు లడ్డూలో పంది కొవ్వు కలిపారని చేసిన తప్పుడు ప్రచారం లాంటిదేనా అని నాని అన్నారు.