PM Modi : చంద్రబాబు విజ్ఞప్తులకు ప్రధాని మోదీ రైట్, రైట్.. ఇక చకచకా పోలవరం పనులు
ప్రధానాంశాలు:
PM Modi : చంద్రబాబు విజ్ఞప్తులకు ప్రధాని మోదీ రైట్, రైట్.. ఇక చకచకా పోలవరం పనులు
PM Modi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ Andhra pradesh విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ఏపీకి కావాల్సిన సాయం అందించేందుకు అది రాజధాని నగరం అమరావతి అయినా పోలవరం ప్రాజెక్ట్ అయినా, తాజాగా vishaka steels విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం స్పందనే ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా amit shah ఏపీ పర్యటన సమయంలోనూ ఏపీకి తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి ఏపీకి మరో కీలక సమాచారం అందింది.
రేపు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు Chandrababu Naidu దావోస్ పర్యటనను పూర్తి చేసుకుని శుక్రవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ వేళ ఏపీకి నిధుల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రులతో ఆయన చర్చించనున్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధనకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేసింది. మొదటి దశ నిర్మాణం పూర్తి చేసేలా రూ.12 వేల కోట్లకు అంగీకరించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అడ్వాన్స్ గా రూ.5 వేల కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.5 వేల కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.5 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పటికే తొలి విడతగా రూ.2,348 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రీయింబర్స్‌మెంట్ కింద మరో రూ.459 కోట్లను సైతం మంజూరు చేసింది. అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభమైనందున అడ్వాన్సుగా ఇవ్వాల్సిన మిగతా రూ.2500 కోట్లను కూడా మంజూరు చేయాలని ఇటీవల కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి అంగీకరించిన కేంద్రం, ఈ మేరకు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. వారంలో ఈ నిధులు ఏపీకి జమ కానున్నాయి.
2019 వరదలు ఆనకట్ట యొక్క పాత డయాఫ్రమ్ వాల్‌ను కొట్టుకుపోయాయి, దీని నిర్మాణానికి దాదాపు రూ. 442 కోట్లు ఖర్చయ్యాయి. భూమి కింద నిర్మించబడిన డయాఫ్రమ్ ప్రధాన ఆనకట్ట యొక్క ప్రధాన భాగాన్ని ఏర్పరుస్తుంది, ఇది ఎగువ నుండి దిగువకు నీటి ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. కేంద్రం విడుదల చేసిన నిధులను కొత్త డయాఫ్రం గోడను పూర్తి చేయడానికి మరియు పునరావాసం మరియు పునరావాస బకాయిలను క్లియర్ చేయడానికి ఉపయోగించబడుతుందని అధికారి తెలిపారు.