Prakash Raj : పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prakash Raj : పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 September 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Prakash Raj : పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ..!

Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్ చేస్తూ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పవన్ ని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. దేశంలో జరిగే రాజకీయ, సినీ, సామాజిక, క్రీడా రంగ అంశాలపై స్పందించే ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ వివాదం పై కూడా స్పందించారు. ఈ క్రమంలో పాన్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ మీరు ఉప ముక్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై విచారణ జరపండి. దీనికి బాధ్యులు ఎవరో కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండని అన్నారు.

Prakash Raj పవిత్రమైన తిరుమల లడ్డు విషయంలో..

అంతేకాఉ తన రియాక్షన్ ఇక్కడితే ఆగదని అన్నారు ప్రకాష్ రాజ్. అంతేకాదు బాధ్యులపై చర్యలు తీసుకునే విషయం పక్కన పెట్టి దేశంలో ఆందోళనలు జరిగేలా చేస్తున్నారని.. దీన్ని ఎందుకు వేరే విధంగా హైలెట్ చేస్తున్నారని రాసుకొచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మత పరమైన ఘర్షణలు ఉన్నాయంటూ కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు అని చివర్లో అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవిత్రమైన తిరుమల లడ్డు విషయంలో వినిపిస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోకుండా మత పరమైన ఘర్షణలు వ్యాప్తి చేయడం సమంజసం కాదని నెటిజన్లు కామెంట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నారు.

Prakash Raj పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ షురూ

Prakash Raj : పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ..!

ఐతే ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటుందని పవన్ చెప్పిన విషయాన్ని ప్రకాష్ రాజ్ మర్చిపోతే ఎలా.. అంటూ ప్రకాష్ రాజ్ ని ఎటాక్ చేస్తున్నారు. ఐతే పవన్ దేశంలో అన్ని ఆలయాలకు సంబందించిన సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఏర్పాటు చేయాలని పవన్ అన్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది