Home » News » Prime Ministers Employment Generation Scheme Has Become A Great Boon For The Unemployed
News

PMEGP : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 25 లక్ష‌లు ఇవ్వ‌నున్న మోదీ..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 20, 2025, 3:00 pm
Advertisement

PMEGP  : ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ (PMEGP) దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకంగా మారింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందించేందుకు తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు ప్రత్యేకంగా లబ్ధి పొందే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రాజెక్ట్ పెట్టిన వారికి 35% వరకు సబ్సిడీ లభించనుండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 25% వరకు ఉంటుంది.

Advertisement

PMEGP : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 25 లక్ష‌లు ఇవ్వ‌నున్న మోదీ..!

PMEGP : నిరుద్యోగులకు గొప్ప వరంగా మారిన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్

ఈ పథకం ద్వారా సబ్సిడీ పొందాలంటే ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకు ద్వారా లోన్‌కి అప్లై చేయాలి. బ్యాంక్ నుంచి లోన్ అప్రూవ్ అయిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్లను PMEGP పోర్టల్ లో అప్‌లోడ్ చేయాలి. ఆధార్, పాన్, ప్రాజెక్ట్ రిపోర్ట్ వంటి వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలి. తరువాత ఖాదీ బోర్డు, ఖాదీ కమిషన్ లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) వంటి ఏజెన్సీలలో ఒకదాన్ని ఎంపిక చేసి, వారు చేసే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సబ్సిడీ విడుదల అవుతుంది.

Advertisement

ఇక EDP ట్రైనింగ్ (Entrepreneurship Development Programme) ఈ పథకంలో కీలకం. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగే ట్రైనింగ్ కాగా, 15 క్లాసులు, 15 ఎగ్జామ్స్ ఉండడం విశేషం. ఈ పరీక్షలు పూర్తి చేసి సర్టిఫికెట్ పొందిన వారికే సబ్సిడీ మంజూరవుతుంది. సబ్సిడీ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా మాత్రమే లభిస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల ద్వారా అయితే ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. కాబట్టి యువత, చిన్నతరహా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఆర్థిక భవిష్యత్తు కోరుకోవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి