Ration Card : రేషన్ కార్డులో పిల్లల పేరు చేర్చాలా .. ?? అయితే ఈ ప్రాసెస్ తెలుసుకోండి .. !! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ration Card : రేషన్ కార్డులో పిల్లల పేరు చేర్చాలా .. ?? అయితే ఈ ప్రాసెస్ తెలుసుకోండి .. !!

Ration Card : ప్రతి ఒక్క పౌరుడికి రేషన్ కార్డు తప్పనిసరి. ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఈ రేషన్ కార్డ్ గుర్తింపును, నివాసం రుజువును అందిస్తుంది. అలాగే బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్ వంటి సబ్సిడీ ఆహార పదార్థాల కోసం రేషన్ కార్డు కావాలి. బ్యాంక్ ఖాతా తెరవడానికి, పాస్ పోర్ట్ కోసం అప్లై చేసుకోవడానికి, ఇతర ప్రభుత్వ సేవలను పొందేందుకు రేషన్ కార్డును ఉఉపయోగిస్తారు. ది ఉన్నవారికి ఆహార సరుకులలో తగ్గింపు లభిస్తుంది. ఈ […]

 Authored By anusha | The Telugu News | Updated on :3 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : రేషన్ కార్డులో పిల్లల పేరు చేర్చాలా .. ?? అయితే ఈ ప్రాసెస్ తెలుసుకోండి .. !!

Ration Card : ప్రతి ఒక్క పౌరుడికి రేషన్ కార్డు తప్పనిసరి. ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఈ రేషన్ కార్డ్ గుర్తింపును, నివాసం రుజువును అందిస్తుంది. అలాగే బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్ వంటి సబ్సిడీ ఆహార పదార్థాల కోసం రేషన్ కార్డు కావాలి. బ్యాంక్ ఖాతా తెరవడానికి, పాస్ పోర్ట్ కోసం అప్లై చేసుకోవడానికి, ఇతర ప్రభుత్వ సేవలను పొందేందుకు రేషన్ కార్డును ఉఉపయోగిస్తారు. ది ఉన్నవారికి ఆహార సరుకులలో తగ్గింపు లభిస్తుంది. ఈ రేషన్ కార్డు పేదలకు, తక్కువ ఆదాయం ఆదాయం ఉన్నవారికి ఒక వరం లాంటిది. రేషన్ కార్డ్ అప్లై చేయడానికి ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, కుటుంబ పెద్ద గుర్తింపు రుజువు, కుటుంబ ఆదాయ రుజువు ఉండాలి.

పిల్లలను రేషన్ కార్డులో ఎలా యాడ్ చేయాలంటే ..?

రేషన్ కార్డు లేకపోతే రాష్ట్ర ఆహార శాఖ వెబ్సైట్ లేదా సమీపంలోని ఆహార శాఖ కార్యాలయాన్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చాలంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

* ముందుగా రాష్ట్ర ఆహార శాఖ వెబ్సైటును సందర్శించాలి.

* యాడ్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ యాడ్ నేమ్ వంటి లింక్ కోసం సెర్చ్ చేయాలి.

* లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయాలి.

* మీ పేరు, రేషన్ కార్డు నెంబర్, పిల్లల పేరు, పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రం నెంబర్, ఆధార్ కార్డ్ నంబర్ వంటి సమాచారాన్ని నింపాలి.

* అప్లికేషన్ తో పాటు అవసరమైన పత్రాలను స్కాన్ చేసి కాపీలను అప్లోడ్ చేయాలి.

* అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

* అప్లికేషన్ సమర్పించాలి.

దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేయవచ్చు. దరఖాస్తు ధృవీకరించిన తర్వాత రేషన్ కార్డులో పిల్లల పేరు యాడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ కి సాధారణంగా 10 నుంచి 15 రోజులు సమయం పడుతుంది. పిల్లల పేరు రేషన్ కార్డులో చేర్చడానికి రేషన్ కార్డ్, పిల్లల ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అవసరం అవుతాయి. పిల్లల పేర్లు రేషన్ కార్డులు యాడ్ చేయాలంటే తప్పనిసరిగా 18 ఏళ్ల లోపు ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత కొత్త రేషన్ కార్డు రెండు వారాలకు వస్తుంది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం అందించే సేవలను పొందడానికి రేషన్ కార్డు తప్పనిసరి.

anusha

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక