Rajagopal Reddy : ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతుంది. అదే సమయంలో ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తన ఏకైక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం మాజీ సీఎం కేసీఆర్‌ని జైలు పంపడమేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయ్యిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ – బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని.. బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ ఉండరని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి పోతారని విమర్శించారు. జగదీశ్ రెడ్డిని తాము చేర్చుకోమని ఆయన జైలుకు పోయే వ్యక్తి అన్నారు. జైల్‌కి పోయే వ్యక్తులను తాము పార్టీలో చేర్చుకోమని తేల్చిచెప్పారు. కురియన్ కమిటీని కలిశానని పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని తనను కమిటీ అడిగిందని చెప్పారు. భువనగిరి ఇన్‌చార్జిగా మెజార్టీతో గెలిపించానని కమిటీకి చెప్పానని అన్నారు. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందని టాక్ ఉంది కానీ తాను ఇన్‌చార్జ్ గా వెళ్లాక పరిస్థితులు మారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని గుర్తుచేశారు.ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక అభ్యర్థి కలిసి కట్టుగా పని చేశామన్నారు. రెండు లక్షల మెజార్టీ వచ్చిందని కమిటీకి చెప్పానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న భారీ కుంభకోణాలు.. పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవకతవకల్ని బయటపెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది.. విలువైన ప్రజాధనం వేస్టు అయ్యిందన్న భావన తెలంగాణ ప్రజలకు కలగాలి. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని అనుకోవటంతో పాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన ప్రజల్లో బలంగా కలగాల్సి ఉంటుంది. అప్పుడే కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి లక్ష్యం నెరవేరుతుందని కొందరు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ప్రతీకార రాజకీయాలతో మనకే నష్టం చేకూరుతుంది. ఏ స్టెప్ అయిన కూడా కాస్త ఆచితూచి వేయాల్సి ఉంటుందని అంటున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.