Rajagopal Reddy : ఒక ల‌క్ష్యం నెర‌వేరింది… జైలుకి పంప‌డ‌మే అన్న ల‌క్ష్యం మిగిలిందన్న‌ రాజ‌గోపాల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajagopal Reddy : ఒక ల‌క్ష్యం నెర‌వేరింది… జైలుకి పంప‌డ‌మే అన్న ల‌క్ష్యం మిగిలిందన్న‌ రాజ‌గోపాల్

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,5:00 pm

Rajagopal Reddy  : ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ముందుకు పోతుంది. అదే స‌మ‌యంలో ఆ పార్టీ నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా తన ఏకైక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం మాజీ సీఎం కేసీఆర్‌ని జైలు పంపడమేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయ్యిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ – బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని.. బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ ఉండరని స్పష్టం చేశారు.

Rajagopal Reddy  క‌క్ష్య సాధింపులా..

మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి పోతారని విమర్శించారు. జగదీశ్ రెడ్డిని తాము చేర్చుకోమని ఆయన జైలుకు పోయే వ్యక్తి అన్నారు. జైల్‌కి పోయే వ్యక్తులను తాము పార్టీలో చేర్చుకోమని తేల్చిచెప్పారు. కురియన్ కమిటీని కలిశానని పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని తనను కమిటీ అడిగిందని చెప్పారు. భువనగిరి ఇన్‌చార్జిగా మెజార్టీతో గెలిపించానని కమిటీకి చెప్పానని అన్నారు. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందని టాక్ ఉంది కానీ తాను ఇన్‌చార్జ్ గా వెళ్లాక పరిస్థితులు మారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని గుర్తుచేశారు.ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక అభ్యర్థి కలిసి కట్టుగా పని చేశామన్నారు. రెండు లక్షల మెజార్టీ వచ్చిందని కమిటీకి చెప్పానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Rajagopal Reddy ఒక ల‌క్ష్యం నెర‌వేరింది జైలుకి పంప‌డ‌మే అన్న ల‌క్ష్యం మిగిలిందన్న‌ రాజ‌గోపాల్

Rajagopal Reddy : ఒక ల‌క్ష్యం నెర‌వేరింది… జైలుకి పంప‌డ‌మే అన్న ల‌క్ష్యం మిగిలిందన్న‌ రాజ‌గోపాల్

కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న భారీ కుంభకోణాలు.. పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవకతవకల్ని బయటపెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. విలువైన ప్రజాధనం వేస్టు అయ్యిందన్న భావన తెలంగాణ ప్రజలకు కలగాలి. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని అనుకోవటంతో పాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన ప్రజల్లో బలంగా కలగాల్సి ఉంటుంది. అప్పుడే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని కొంద‌రు ప్ర‌ముఖులు చెప్పుకొస్తున్నారు. ప్ర‌తీకార రాజ‌కీయాలతో మ‌న‌కే న‌ష్టం చేకూరుతుంది. ఏ స్టెప్ అయిన కూడా కాస్త ఆచితూచి వేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది