Nara Ramamurthy Naidu : అవమాన భారంతో రాజకీయాలకు రామ్మూర్తి నాయుడు గుడ్ బై

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: November 16, 2024, 4:10 pm
  •  Nara Ramamurthy Naidu : అవమాన భారంతో రాజకీయాలకు రామ్మూర్తి నాయుడు గుడ్ బై

Nara Ramamurthy Naidu : ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి Andhra pradesh CM చంద్రబాబు నాయుడు Chandrababu Naidu Brother  త‌మ్ముడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో క‌న్నుమూశారు. హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించ‌డంతో తుదిశ్వాస విడిచారు. మ‌ర‌ణ వార్త తెలియడంతో నారా, నందమూరి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక నారా రామ్మూర్తి నాయుడు వ్యక్తిగత, రాజకీయ జీవితానికి వస్తే… 72 ఏళ్ళ రామ్మూర్తి నాయుడు… నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు రెండో కుమారుడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు. ఒకరు నటుడు రోహిత్‌, మరొకరు నారా గిరీష్. 1994 లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేసారు.

Nara Ramamurthy Naidu 1999 ఎన్నికల్లో  రామ్మూర్తి నాయుడు గుడ్ బై

1999 ఎన్నికల్లో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి చేతిలో ఆయన ఓటమి పాల‌య్యారు. తన సొంత నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడంతో అవమాన భారంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అనంత‌రం సైతం అనారోగ్య కారణాలు ఆయనను వెంట‌డంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు తన సోదరుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పార్టీ బాధ్యతలు చూసేవారు.

Nara Ramamurthy Naidu : అవమాన భారంతో రాజకీయాలకు రామ్మూర్తి నాయుడు గుడ్ బై

Nara Ramamurthy Naidu : అవమాన భారంతో రాజకీయాలకు రామ్మూర్తి నాయుడు గుడ్ బై

2014లో చంద్రబాబు తిరిగి సిఎం కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. రామ్మూర్తి నాయుడు అనారోగ్య దృష్ట్యా నారా రోహిత్ సినిమాలకు కూడా దూరం అయిన‌ట్లుగా చెబుతుంటారు. ఇటీవలే రోహిత్ నిశ్చితార్ధం కూడా జరిగింది. కొడుకు పెళ్లి చూడకుండానే రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన నారావారిపల్లెలో జరగనున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp