Revanth Reddy VS KCR : మాటకు మాట.. సీఎం రేవంత్ రెడ్డి VS కేసీఆర్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy VS KCR : మాటకు మాట.. సీఎం రేవంత్ రెడ్డి VS కేసీఆర్.. వీడియో

 Authored By aruna | The Telugu News | Updated on :14 February 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy VS KCR : మాటకు మాట.. సీఎం రేవంత్ రెడ్డి VS కేసీఆర్

Revanth Reddy VS KCR : తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలకు కృష్ణ గోదావరి జలాలే కీలకమని, కృష్ణా జలాలపై ఇప్పటికే శాసనసభలో ప్రసంగించామని, గోదావరి జలాలపై త్వరలో చర్చిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైనింగ్ పేరిట ప్రాజెక్టులకు మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అంటూ బ్యారేజీలను కట్టుకుంటూ పోయింది. మ్యాన్ మేడ్ వండర్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని మేము ఇక్కడ అనడం లేదు. కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ వివరిస్తే బాగుంటుంది. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలి. బ్యారేజ్ కి ఏం జరిగిందో చూసి తెలంగాణ ప్రజలకు వివరించాలి.

పునాదుల కింద ఇసుక కదలడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గత ప్రభుత్వ నేతలు అన్నారు. వాళ్ళు ఇసుకలో పేక మేడలు కట్టారా..సభలో ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టాక..కాళేశ్వరం పై హరీష్ రావు పై ప్రాజెక్టు ఎవరెవరికి ఏటీఎంలా మారింది అన్న అంశంపై చర్చిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణానది జలాల తెలంగాణ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఛలో నల్గొండ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కట్టే కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చాతనైన కాకపోయినా పులిలాగా లేచి పోట్లాడుతానన్నారు. నేను ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని తెలిపారు. అసెంబ్లీలో పెట్టిన తీర్మానం చక్కగా లేదని అందులో త్రాగునీళ్ళు సాగునీరు పెట్టారు కానీ విద్యుత్ గురించి ప్రస్తావించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కావలసింది పైసలు పైరవీలే అనే ఎద్దేవా చేశారు. ప్రజలను కరెంటుకు నీళ్లకు మంచినీళ్లకు ఇబ్బందులకు గురి చేస్తే ఎక్కడికి అక్కడ నిలబడతామని హెచ్చరించారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో జనరేటర్ పెట్టి మరి నడిపిస్తున్నారని తెలిపారు. నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఒక్క సమావేశంలో ఏడుసార్లు కరెంటు పోతుందని ఎద్దేవా చేశారు. రైతుబంధు ఇవ్వడానికి కూడా చేతనవ్వడం లేదు. ఇంత దద్దమ్మలా అని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకున్నా పర్లేదు కానీ రైతుల్ని పట్టుకొని చెప్పుతో కొట్టాలంటారా మీరు అని ప్రశ్నించారు. ఎన్ని గుండెలు రా మీకు..పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి. జాగ్రత్త బిడ్డ అని హెచ్చరించారు. రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయని వాళ్ళు చెప్పు దెబ్బతో మూడు పళ్లు ఊడతాయి అన్నారు. కరెంటు సరఫరా మంచినీళ్లు సరఫరా ఇవ్వాలి. ఇవన్నీ పట్టించుకోకుండా బలాదూర్ గా తిరుగుతారని ప్రశ్నించారు. అసెంబ్లీ తర్వాత మేము కూడా మేడిగడ్డ పోతామని, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రజలకు చెబుతామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదని తెలిపారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని మేము మళ్ళీ రెండు మూడింతల బలంతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది