Barrelakka Sirisha : బర్రెలక్క నేటితరం గాంధీ ‘ .. సపోర్ట్ చేయాల‌ని రోజు రోజుకి పెరుగుతున్న మ‌ద్ద‌తు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Barrelakka Sirisha : బర్రెలక్క నేటితరం గాంధీ ‘ .. సపోర్ట్ చేయాల‌ని రోజు రోజుకి పెరుగుతున్న మ‌ద్ద‌తు..!

 Authored By aruna | The Telugu News | Updated on :28 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Barrelakka Sirisha : బర్రెలక్క నేటితరం గాంధీ ' ..

  •  Barrelakka సపోర్ట్ చేయాల‌ని రోజు రోజుకి పెరుగుతున్న మ‌ద్ద‌తు..!

Barrelakka Sirisha  : ఇప్పుడు దేశవ్యాప్తంగా బర్రెలక్క అలియాస్ శిరీష పేరు చర్చనీయాంశంగా మారింది. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క శిరీషకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఒంటరిగా పోరు చేస్తూ స్థానికంగా మద్దతు లభించడంతో బర్రెలక్క ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఆమెకు రోజు రోజుకి మరింత ఆదరణ పెరుగుతుండడంతో ప్రతిపక్షాల పార్టీలు ఆమెపై దాడి చేయడం కూడా జరిగింది. దీంతో బర్రెలక్కకు తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు శిరీష కు భద్రత ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో బర్రెలక్క జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ లోను అన్ని గ్రామాలలోని ప్రచారం చేస్తూ తన మాటలతో ఆకర్షిస్తున్నారు.

అయితే బర్రెలక్క పై దాడి జరిగిన తర్వాత దేశం నలుమూలల నుంచి మద్దతు పెరుగుతూ వస్తుంది. ఇందులో సామాన్య ప్రజలతో పాటు మేధావులు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఇక తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం బర్రెలక్కకు అండగా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా బర్రెలక్కను నేటి తరం గాంధీతో పోల్చారు. అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీజీ మొదలుపెట్టిన సత్యాగ్రహ ఉద్యమం, బర్రెలక్క ఉద్యమం రెండూ ఒకేలా ఉన్నాయి అని ఆర్జీవి ట్వీట్ వేశారు. ఈయనతో పాటు ఇండస్ట్రీలోని తదితరులు కూడా బర్రెలక్కకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ బర్రెలక్కకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కను గెలిపించి భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని ఆయన అన్నారు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను పక్కకు తప్పించి బర్రెలక్కకు మద్దతుగా నిలవాలని అన్నారు. మంగళగిరి వి. జె కాలేజీ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ప్రజలకు చేసిన హెచ్చరికలను ప్రస్తావించారు. మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే ఎన్నికల్లో డబ్బు ఉన్నవారికి కాదు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సామాన్య యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి అని అన్నారు. ఇప్పటికైనా ప్రధాన పార్టీలు తమ కార్యకర్తలతో బర్రెలక్క విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది