Hindenburg : ఉన్నట్టుండి హిండెన్‌బర్గ్ మూసివేత.. ఫౌండర్ సంచలన ప్రకటన చేయడానికి కారణం..!
ప్రధానాంశాలు:
Hindenburg : ఉన్నట్టుండి హిండెన్‌బర్గ్ మూసివేత.. ఫౌండర్ సంచలన ప్రకటన చేయడానికి కారణం..!
Hindenburg : జనవరి 2023 లో అదానీ గ్రూప్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ Hindenburg Research ఇప్పుడు మూసివేసేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతానని అన్నారు. తన బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతానని అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఈ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ను నాథన్ అండర్సన్ 2017లో స్థాపించారు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని తన వెబ్‌సైట్‌లో ఈ కంపెనీ వెల్లడించింది.
Hindenburg మూసివేతకి కారణమేంటి?
పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను ఇది విశ్లేషిస్తుంది. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చి సేవలు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తిస్తుంది. ఈ కంపెనీ షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెడుతుంది. ఈ సంస్థ ఎప్పటి నుంచో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఈమధ్యే భారత్ లో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంస్థ అదానీ గ్రూప్ పై షార్ట్ సెల్లింగ్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అదానీ గ్రూప్ నే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్నో సంస్థలపై ఆర్థిక పరిశోధనలు నిర్వహించి..ఆరోపణలు చేయడంతో సదరు కంపెనీల షేర్లు పతాళానికి పడిపోయాయి. షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభాలాను ఆర్జించడమే హిండెన్ బర్గ్ పని అన్నట్లుగా ఎన్నో పెద్ద పెద్ద పరిశోధనల రిపోర్టులను నివేదించింది. దీనినే ఆర్థిక రంగంలో మానవ నిర్మిత క్రుత్రిమ విపత్తుల్ని గుర్తించడం అని పేరు పెట్టుకుంది.
రెండేళ్ల క్రితం భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేయడం వల్ల ఆ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. అదానీ గ్రూప్ తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది. ప్రపంచ కుబేరుల్లో ఆ దశలో రెండో స్థానానికి చేరుకున్న అదానీ.. మళ్లీ సగానికిపైగా సంపద కోల్పోయి ఎక్కడికో పడిపోయారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను అదానీ గ్రూప్ ఖండించినా.. చాన్నాళ్ల పాటు అదానీ నష్టాల్ని అనుభవించారు. అయితే అదానీ గ్రూప్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని.. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు మళ్లీ ఆయన సంపద పెరిగింది. ఆ తర్వాత కూడా అదానీ గ్రూప్‌పై పలుమార్లు హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేయగా.. దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.